Bigg Boss Season 6 : లోగో వచ్చేసింది

తెలుగు టీవీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షో బిగ్ బాస్ సీజన్ 6. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుని ఆరో సీజన్ కు సిద్ధమవుతుంది బిగ్ బాస్. ఐదో సీజన్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారమైంది. ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ బాగానే సాగినా, విజయవంతం మాత్రం కాలేదు. ఆ సమయంలో ఐపీఎల్ రావడంతో, పెద్దగా వ్యూస్ రాలేదు. దీంతో బిగ్ బాస్ అభిమానులకు నిరాశ తప్పలేదు.

దీంతో పాటు బిగ్ బాస్ సీజన్ 6పై అంచనాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉండగా, సీజన్ 6కు కింగ్ నాగార్జున హోస్ట్ చేయడం లేదని వార్తలు వచ్చాయి. నాగార్జున తన సినిమా పనుల్లో బిజీ ఉండటం వల్ల బిగ్ బాస్ కు దూరమవుతున్నాడని టాక్ వచ్చింది. నాగార్జున ప్లేస్ లో మరో స్టార్ హీరో ను స్టార్ మా తీసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ, నాగార్జున ఈ వార్తలకు బ్రేక్ వేస్తూ, తానే హోస్ట్ గా ఉంటున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా కొద్ది రోజుల ముందు బిగ్ బాస్ ప్రోమో షూటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా టీవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 నుంచి అప్ డేట్ వచ్చింది. పది సెకన్ల వీడియోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విడుదల చేసింది. ఈ వీడియోలో సీజన్ 6 లోగోను రివీల్ చేసింది. అలాగే కమ్మింగ్ సూన్ కూడా వీడియోలో జోడించారు. స్టార్ మా ట్విట్టర్ లో పోస్ట్ చేసి ప్రేక్షకులను గతం కంటే అలరించేలా ఉంటుందని, అతి త్వరలోనే ఈ వినోదం ప్రారంభమవుతుందని రాసుకొచ్చింది. కాగా, ఈ బిగ్ బాస్ సీజన్ 6 ను మా టీవీలో రోజుకు గంట చొప్పున ప్రసారం చేస్తారని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు స్ట్రీమింగ్ చేస్తారని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు