Yadbhavam TadBhavati : వరుణ్ చూపు మాస్ వైపు

విభిన్న కథాంశాలు, పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఓ ఇమేజ్ ఏర్పర్చుకున్నారు హీరో వరుణ్ సందేశ్. ఈ హీరో ప్రస్తుతం మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న చిత్రం ‘యద్భావం తద్భవతి’. ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తుంది. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ‘యద్భావం తద్భవతి’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా వరుణ్ సందేశ్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే వరుణ్ సందేశ్ యాక్షన్ మోడ్‌లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాడు. పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘మైఖెల్ సెట్‌లో యద్భావం తద్భవతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ మాస్‌ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ఉన్నాడు.’ అని అన్నాడు.

వరుణ సందేశ్ మాట్లాడుతూ, ‘నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. హ్యాపీ డేస్ విడుదలై దాదాపు పదిహేనేళ్లు అవుతుంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తమని వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు