Suhas: “రైటర్” ప్రయత్నం ఫలిస్తుందా ?

సుహాస్.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ వచ్చి.. ప్రస్తుతం ఏకంగా హీరో వరకు ఎదిగాడు. దొచేయ్ సినిమాతో ఇండస్ట్రీ పరిచయమైనా, నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా సమయం పట్టింది. లక్కీ గా కలర్ ఫోటో సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తనలో ఉన్న నటుడ్ని అందరికి చూపించాడు. దీంతో అది పెద్ద విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. నేషనల్ అవార్డ్ ను కూడా సంపాదించుకుంది.

కలర్ ఫోటో మూవీతో సుహాస్ మంచి నటుడుగా గుర్తింపు మాత్రమే కాదు.. అవకాశాలు కూడా వచ్చాయి. దీని తర్వాత సుహాస్ కు హీరోగా ఫ్యామిలీ డ్రామా అనే ఓటీటీ మూవీ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సుహాస్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. అంతే కాదు.. హిట్ 2 వంటి భారీ ప్రాజెక్ట్ లో విలన్ పాత్ర వచ్చింది. అంతే కాదు.. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కూడా పోల్చారు. అంతటి గుర్తింపు వచ్చిన సుహాస్ ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో ఫిబ్రవరి 3న థియేటర్ లో వస్తున్నాడు సుహాస్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సరదాగా సాగుతూ, ఇంట్రెస్ట్ ను పెంచుతూ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో ప్రేక్షకులను కుటుంబ సమేతం రప్పించడానికి సుహాస్ ప్లాన్ వేస్తున్నాడు. అందులో భాగంగా తన సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించాడు.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమా టికెట్లు తెలంగాణాలో గరిష్టంగా సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలతో లభించనున్నాయి. ఏపీలో గరిష్టంగా సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 177 రూపాయలుగా నిర్ణయించారు. టికెట్ ప్రైజ్ తక్కువ ఉండటంతో ప్రేక్షకులు కుటుంబసమేతంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో కలెక్షన్లు భారీగానే వచ్చే ఛాన్స్ ఉంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు