Enno Ratrulosthayi Video Song : ఏ మాత్రం తగ్గకుండా..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా అమిగోస్. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న అమిగోస్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళ్యాణ్ రామ్ 3 లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోసారి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మకoగా సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి “ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదే వెన్నెలమ్మ ” అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. గతంలో నందమూరి బాలయ్య చేసిన ధర్మక్షేత్రం సినిమాలోనిది ఈ సాంగ్. ఇళయరాజా స్వర కల్పనలో బాలు ఆలపించిన ఆ పాట… రొమాంటిక్ సాంగ్స్ లో ముందు వరుసలో కనిపిస్తుంది.

- Advertisement -

అలాంటి ఆ పాటను ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయించాడు. ఎస్పీ చరణ్ మరియు సమీరా భరద్వాజ్ ఈ పాటను ఈ సినిమాలో పాడారు. కళ్యాణ్ రామ్ మరియు ఆశీకా రంగనాథ్ పై ఈ పాటను అందంగా చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్‌ క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ మ‌ధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేస్తుంది. చ‌క్క‌టి ట్యూన్‌కి త‌గ్గ సాహిత్యం,  విజువ‌ల్స్ ఆడియెన్స్ క‌ళ్ల‌కు ట్రీట్‌లాగా ఉంది. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంటే.. క‌ళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ సాంగ్ కూడా చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. ఓల్డ్ సాంగ్ కు ఏ మాత్రం తగ్గకుండా, ఈ పాటను రీమిక్స్ చేశారు.

కాగా బాలకృష్ణ పాటలు కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు “అరె ఓ సాంబ” సాంగ్ రీమిక్స్ చేశారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు