khaidi 2 : రోలెక్స్ ఉంటాడా ?

విభిన్న చిత్రాల కథానాయకుడు కార్తీ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “ఖైదీ”. కేవలం 36 రాత్రుల్లో ముగిసిన ఈ చిత్రం షూటింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్తీ కెరియర్ లోనే చెప్పుకోదగిన సినిమాల్లో “ఖైదీ” ఒకటి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే కార్తీ తాజాగా నటించిన చిత్రం “విరుమన్”. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు కార్తీ.

ఈ విరుమాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఖైదీ 2 సినిమాపై కార్తీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఖైదీ 2 సినిమా షూటింగ్ 2023లో ప్రారంభమవుతుందని చెప్పాడు కార్తీ. ప్రస్తుతం విజయ్ తో లోకేష్ కనకరాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే ఖైదీ 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలియజేశాడు. అయితే లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మరో సినిమా ” విక్రమ్”. ఈ సినిమాలో రోలెక్స్ అనే పవర్ ఫుల్ పాత్రలో సూర్య అదరగొట్టాడు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఖైదీలోని కార్తీ “ఢిల్లీ” పాత్రకు సంబంధించిన సన్నివేశం కూడా ఉంది.

అలా ఖైదీని, విక్రమ్ సినిమాను లింక్ చేశాడు లోకేష్ కనకరాజ్, అలాగే రెండు సినిమాలకు రోలెక్స్ పాత్ర సంబంధం ఉన్నట్టు చూపించాడు. అయినా, ఖైదీ 2 లో రోలెక్స్ పాత్ర ఉంటుందో, లేదో అన్న విషయంపై మాత్రం సస్పెన్స్ ని క్రియేట్ ఉంది. దీనికి కార్తీ సమాధానంగా.. చాలా సింపుల్ గా ఆ విషయం మాత్రం తనకు తెలియదు అని చెప్పి చేతులు దులుపుకున్నాడు. దీంతో “ఖైదీ 2” లో ఈ సోదరులు ఇద్దరు కలిసి నటిస్తారో లేదో అనే సస్పెన్స్ ఇంకా వీడలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు