Ganesh : దసరా బరిలో బెల్లంకొండ

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. “స్వాతిముత్యం” సినిమాతో గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతుంది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె కృష్ణా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ‘స్వాతిముత్యం’ సినిమాలో బాలమురళీ పాత్రలో గణేష్ నటిస్తున్నాడు. భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బోల్లమ్మ కనిపించనుంది. జీవితం-ప్రేమ-పెళ్లి వంటి వాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. వాటి మధ్య స్వాతిముత్యం లాంటి యువకుడి జీవిత ప్రయాణం-ప్రేమాయణం ఎలా సాగింది అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన “స్వాతిముత్యం” చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. ఇవాళ కొత్త తేదీని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. దసరా కానుకగా, అంటే అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో పాటు సినిమాలోని ఓ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో హీరో బెల్లంకొండ గణేష్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు