టాలీవుడ్ క్వీన్ సమంత ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, బిజీ బిజీగా గడుపుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. హార్రార్, కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఏదైనా సై అంటుంది. ఈ భామ లేడీ ఓ పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోపక్క కమర్షియల్, లవ్ స్టోరీస్ సినిమాల్లోనూ నటిస్తోంది.
సమంత ‘శాకుంతలం’, ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెండ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యశోద సినిమాను హరి, హరీష్ అనే దర్శకద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విమెన్ సెంట్రిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ సినిమాను ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు.
అయితే, ఆగస్టులో అదే సమయానికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. పోటీ ఎక్కువ ఉండటంతో సమంత సినిమా వాయిదా పడుతుందని ప్రచారం సాగింది. కానీ, యశోద సినిమా మేకర్స్ పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అయితే, టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం యశోద సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీనికి పలు కారణాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. కారణాలు ఏదైనా, యశోద మాత్రం ఆగష్టు బరిలో రావడం కష్టమే అని తెలుస్తుంది.