Happy Birthday: ఇదోరకపు హాస్యం

లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో రితేష్ రానా దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ” హ్యాపీ బర్త్ డే”. ఈ మూవీని క్లాప్ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మొదటి సినిమా మత్తువదలరా తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రితేష్.
పెద్దగా స్టార్ కాస్ట్ ను నమ్ముకోకుండా కేవలం కథను, తన రైటింగ్ ను నమ్మకుని ఆడియన్స్ తో నవ్వులు పూయించాడు.

ప్రస్తుతం రితేష్ ఇప్పుడు హ్యాపీ బర్త్ డే సినిమాను ప్రేక్షకుల మధ్యకు తీసుకొస్తున్నాడు, జులై 8న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రొమోషన్స్ ను భిన్నంగా , హాస్యాస్పదంగా కొనసాగిస్తున్నారు. ఇదివరకే గెటప్ శ్రీను యాంకర్ గా , కమెడియన్ సత్య , నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ ఎవరో హీరో అంటూ ఒక ఫన్ డిబేట్ ను చేసారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ సినిమా సరియల్ కామెడీ అని అర్ధమవుతుంది. సరియల్ కామెడీ అంటే అర్థంకాని ప్రేక్షకులకు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది అని హింట్ ఇస్తూ ఈ ట్రైలర్ కొనసాగించారు.

ట్రైలర్ ఆద్యంతం వరకు కామెడీని జోడించి, ట్రైలర్ లోనే తనదైన మార్క్ ను చూపించాడు రితేష్. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో నరేశ్ అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు