Vikramarkudu 2 Update : విక్రమార్కుడు సీక్వెల్ అఫిషియల్ అనౌన్స్మెంట్… హీరో ఎవరంటే?

Vikramarkudu 2 Update : మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో విక్రమార్కుడు మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని ఎప్పటి నుంచో ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఈ సీక్వెల్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు నిర్మాత కేకే రాధా మోహన్. మరి ఇంతకీ సీక్వెల్ లో హీరోగా ఎవరు నటించబోతున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ

రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు మూవీ 2006లో రిలీజ్ అయ్యి మాస్ మహారాజ కెరీర్ కు బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి బూస్ట్ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రవితేజ మార్కెట్, రేంజ్ ను పెంచింది.. ఇక ఇందులో రవితేజ అత్తిలి సత్తిబాబు అనే దొంగగా, విక్రమ్ రాథోడ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాదు. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ తో ఇరగదీసాడు. అలాగే ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో 11 కోట్లతో తెరకెక్కగా, 23 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తూ ఉండడంతో విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు రవితేజ అభిమానులు. ఎట్టకేలకు ఆ టైం రానే వచ్చింది.

తాజాగా నిర్మాత రాధామోహన్ ఓ మూవీ ఈవెంట్ లో విక్రమార్కుడు సీక్వెల్ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. రైటర్ విజయేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు 2 స్టోరీని రెడీ చేసి పెట్టారని, స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని, సరైన కాస్టింగ్ దొరికితే త్వరలోనే ఈ మూవీని స్టార్ట్ చేస్తామని అఫీషియల్ గా చెప్పేశారు. ఈ మూవీతో పాటు భజరంగి భాయిజాన్ 2 కూడా పట్టాలెక్కబోతోందని క్లారిటీ ఇచ్చారు. అయితే భజరంగి భాయిజాన్ 2 మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడని చెప్పిన నిర్మాత రాధా మోహన్ విక్రమార్కుడు సీక్వెల్ లో మాత్రం హీరో ఎవరన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

రవితేజకు సీక్వెల్ పై నో ఇంట్రెస్ట్

గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలలో కూడా నిర్మాత రాధా మోహన్ విక్రమార్కుడు 2 మూవీ స్టోరీ రెడీ అయిందని చెప్పేశారు. మూడేళ్ల క్రితమే తమ బ్యానర్ పై టైటిల్ రిజిస్టర్ చేయించామని చెప్పిన ఆయన డైరెక్టర్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. సంపత్ నందితో ఈ సీక్వెల్ ప్లాన్ చేశామని చెప్పి షాక్ ఇచ్చారు రాధా మోహన్. దీంతో విక్రమార్కుడు 2 మూవీకి డైరెక్టర్ రాజమౌళి కాదనే విషయంపై అప్పుడే క్లారిటీ వచ్చింది. ఇక విక్రమార్కుడు సీక్వెల్ లో నటించడానికి రవితేజ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆయన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నామని, రవితేజ ఒప్పుకుంటేనే సీక్వెల్ చేస్తామని చెప్పిన ఈ నిర్మాత తాజా ఈవెంట్లో సరైన కాస్టింగ్ దొరికితే వెంటనే మూవీని మొదలు పెడతామని కామెంట్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఈ మూవీపై రవితేజకు ఇంట్రెస్ట్ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం సీక్వెల్ కు డైరెక్టర్ రాజమౌళి కాకపోవడమే అయ్యి ఉండొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు