Sekhar Kammula : డబ్బు కోసం తీయలేదు.. నాకు నచ్చినట్టు తీస్తాను – శేఖర్ కమ్ముల

Sekhar Kammula : టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. అత్యంత న్యాచురల్ గా ఈయన సినిమాలు ఉంటాయి. మన ఇంట్లో జరుగుతున్నట్టే శేఖర్ కమ్ముల కథలుంటాయి. ఎదో ఆయన ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన అనామిక అనే రీమేక్ తప్ప శేఖర్ కమ్ముల సినిమాలన్నీ యూత్ కి దగ్గరగా ఫ్యామిలీస్ తో కలిసి చూడాల్సిన సినిమాలే ఉంటాయి. ఇప్పటికిప్పుడు కూడా శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే చాలు యూత్ హీరోహీరోయిన్ల గురించి కూడా పట్టించుకోకుండా ఇది శేఖర్ కమ్ముల సినిమా అని చూసేస్తారు. టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల, సుకుమార్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్ల తర్వాత డైరెక్టర్ ఇమేజ్ తో సినిమాలు చూసే ఫాలోయింగ్ డైరెక్టర్ ఇమేజ్ కి మాత్రమే. ఓవరాల్ గా డీసెంట్ చిత్రాల‌కు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్. ఆనంద్ నుంచి ల‌వ్ స్టోరీ వ‌ర‌కూ ఎన్నో విభిన్న చిత్రాల‌తో త‌న‌కంటూ ఓశైలిని ఏర్పరచుకున్న ద‌ర్శ‌కుడు ఈయన.

పాతికేళ్ల ప్రయాణం..

టాలీవుడ్ లో ఎన్నో ఫ్యామిలీ, లవ్ స్టోరీస్, యూత్ ఎంటెర్టైనర్స్ తీసిన శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తాజాగా ద‌ర్శ‌కుడిగా ఆయ‌న 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న ప్ర‌యాణం గురించి ప‌రిశ్ర‌మ‌లో పడిన కష్టాల గురించి ఉద్దేశించి త‌న మ‌న‌సులో భావాలను ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ ఈ సుదీర్ఘ ప్ర‌యాణం తనకెంతో గ‌ర్వంగా అనిపిస్తుందని, ఎందుకంటే ఈ సినిమా ప్ర‌పంచం కష్టమైనదని, నిత్యం క‌ఠిన‌మైన స‌వాళ్లుతో నిండి ఉంటుందని అన్నాడు. అలాగే ఇక్క‌డ స‌క్సెస్ ఇస్తే పైన ఉంటాం. లేక‌పోతే పాతాళంలో ఉంటాం. ఆర్దికంగా తాను ఇండస్ట్రీ లో ఓ రేంజ్ లో ఎదగలేకపోయినా, ఇలాంటివ‌న్నీ ఎదుర్కుని ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నా సిద్దాంతాల‌తో సినిమాలు చేస్తూ, వాటితో అంద‌ర్నీ మెప్పించి స్థిరంగా ఉన్నందుకు గ‌ర్వంగా ఉందని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.

డబ్బు కోసం సినిమా చేయలేదు..

అయితే శేఖర్ కమ్ముల తన సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఇప్ప‌టివ‌ర‌కూ తీసిన సినిమాలు స‌మాజంపై ప్రతికూల‌తతో చూపించే అంశాలేవి లేకుండా అందరికి నచ్చేలా తీశానని ఎక్కువ సంతృప్తినిచ్చింది అన్నాడు. అయితే ఈ పాతికేళ్ల‌లో పేరు కోసమో డ‌బ్బు కోస‌మో ఎప్పుడూ ఏ సినిమా తీయ‌లేదని అన్నాడు. అలాగే నాకు న‌చ్చిన క‌థ‌ని నాకు తోచిన విధంగా తీసి ఎంతో ఫ్యాష‌న్ తో పనిచేస్తానని అన్నాడు. అయితే ఈ పాతికేళ్లలో ఆయ‌న కేవ‌లం ప‌ది సినిమాలు మాత్ర‌మే చేసారు. డాల‌ర్ డ్రీమ్స్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన మొదటి సినిమాతో అంతగా సక్సెస్ కొట్టలేకపోయినా తన మార్క్ ని చూపించాడు. కానీ ఆ త‌ర్వాత `ఆనంద్` లాంటి మంచి కాఫీ సినిమా అందించాడు. ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్, లీడర్ లాంటి సినిమాలు ఆయన్ని స్టార్ డైరెక్ట‌ర్ గా నిల‌బెట్టాయి. మధ్యలో కొన్ని సినిమాలు అంతగా ఆడకపోయినా, మ‌ళ్లీ `ఫిదా`తో బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇచ్చి, రెండేళ్ల కింద ల‌వ్ స్టోరీ తో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌ నాగార్జున‌ల‌తో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు