Kk Radha Mohan: ఆ రెండు స్క్రిప్ట్ లు రెడీగా ఉన్నాయి

ఎస్.ఎస్ రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్నారు రాజమౌళి. కేవలం తన గుర్తింపు సాధించడమే కాకుండా తెలుగు సినిమా కూడా ఒక సరికొత్త గుర్తింపును తీసుకొచ్చి తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చుని పెట్టాడు. శాంతి నివాసం అనే సీరియల్ కి మొదటిగా దర్శకత్వం వహించిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా మారాడు. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. కానీ అంతకుమించి తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసే అంత రేంజ్ కు ఎదుగుతాడు అని బహుశా అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు.

రాజమౌళి విషయానికి వస్తే ప్రతి సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ సినిమా సినిమాకి ఒక వేరియేషన్ చూపిస్తూ కెరియర్ లో ముందుకెళ్లారు. అయితే రామ్ చరణ్ తేజ్ తో మగధీర సినిమాను తీసి తెలుగు సినిమా చరిత్రను తిరగరాశారు. ఆ తరుణంలోని నెక్స్ట్ లెవెల్ సినిమా చేస్తారు అనుకున్నప్పుడు మళ్లీ సునీల్ తో మర్యాద రామన్న లాంటి ఒక సింపుల్ సినిమాను చేశారు. మళ్లీ ఈగని పెట్టుకోని సినిమా చేయొచ్చు అంటూ నిరూపించారు. తెలుగు సినిమా కి ఆ ప్రయోగం చాలా కొత్తగా అనిపించింది. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఎవరు ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోకి ఒక స్పెషలైజేషన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా రవితేజ విషయానికి వస్తే విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ లో ఉన్న కామెడీ యాంగిల్ తో పాటు. యాంగ్రీ ఎలిమెంట్స్ ని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు జక్కన్న. ఇదే సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేసినా కూడా ఒరిజినల్ ఇచ్చిన ఇంపాక్ట్ ను రీమేక్ సినిమాలు చూపించలేకపోయాయి.

- Advertisement -

రాజమౌళి తన సినిమాల విషయంలో తన కుటుంబ సభ్యులను ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. టెక్నీషియన్స్ కూడా మాక్సిమం వాళ్లే ఉంటారు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నిటికీ కూడా విజయేంద్రప్రసాద్ కథను అందిస్తారు. ఆ ఎన్నో అద్భుతమైన కథలను అద్భుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ రాసిన గొప్ప కథలలో విక్రమార్కుడు ఒకటి. అయితే విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా కంప్లీట్ గా పూర్తయినట్లు సమాచారం. రూల్సాన్ అనే సినిమా ఈవెంట్ కు హాజరైన కేకే మోహన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ సినిమాతో పాటు బజరంగీ భాయిజాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. ఈ రెండు కథలను కూడా సిద్ధం చేసింది రచయిత విజయేంద్రప్రసాద్.ఇకపోతే విక్రమార్కుడు విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దీనిని తెరకెక్కిస్తారు అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి స్థాయి మారిపోయింది. ప్రపంచ ఆడియన్స్ అంతా రాజమౌళి నుంచి సినిమా ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నారు.

ఇదివరకే ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడు అని వార్తలు వినిపించాయి. కానీ రాజమౌళి తప్ప ఏ దర్శకుడు చేసిన రవితేజ ఇంట్రెస్ట్ గా లేరని కూడా తెలిసింది. ఇకపోతే సిద్దమైన ఈ రెండు స్క్రిప్ట్లకు సరైన నటులు దొరికితే ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు