Banned Movies on OTT : ఇండియన్ థియేటర్లలో ఈ సినిమాలకు నో ఎంట్రీ… కానీ ఓటిటిలో చూడొచ్చు

Banned Movies on OTT : కొన్ని సినిమాలు వివిధ కారణాల వల్ల థియేటర్లలోకి రాకుండా పోతాయి. సినిమాలు ఇలా బ్యాన్ అవ్వడానికి రాజకీయ, మత, సాంస్కృతిక కారణాలు కూడా ఉంటాయి. మరికొన్నింటికీ ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తింటాయని కారణంతో సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాదు. అలా నిషేధించిన సినిమాలు ఓటీటీలో మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బాండిట్ క్వీన్

బందిపోటు రాణి పూలన్ దేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ బాండిట్ క్వీన్. ఈ మూవీ పలు కారణాల వల్ల థియేటర్లలోకి రాలేకపోయింది. కానీ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం అందుబాటులో ఉంది.

2. గాండు

ఈ మూవీ మితిమీరిన బూతుల కారణంగా బ్యాన్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో మాత్రం సెన్సార్ లేదు కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. బ్లాక్ ఫ్రైడే

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముంబైలో జరిగే పేలుళ్ల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా థియేటర్లలోకి రాలేకపోయింది గాని హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.

4. లవ్

2017లో ఈ మూవీ వచ్చింది. గే సెక్స్ కు సంబంధించిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించొచ్చు.

4. ఫైర్

ఈ మూవీలో నందితా దాస్, షబానా అజ్మీ లెస్బియన్లుగా కనిపించారు. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

5. అన్ ఫ్రీడం

రెండు వేరు వేరు దేశాల్లో ఉన్న రెండు వేరు వేరు స్టోరీల చుట్టూ తిరుగుతుంది ఈ అన్ ఫ్రీడం మూవీ. ముస్లిమ్ టెర్రరిస్టులు, లెస్బియన్ అమ్మాయికి బలవంతపు పెళ్లి నేపథ్యంలో సాగే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

6. వాటర్

దీపా మోహతా దర్శకత్వంలో రూపొందిన వాటర్ మూవీ 1930లో భర్తలను కోల్పోయి విధవలుగా మారిన స్త్రీల చుట్టూ తిరుగుతుంది. ఇందులో సతీసహగమనం వంటి అప్పటి దారుణమైన పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపించారు. దీన్ని యూట్యూబ్లో చూడొచ్చు.

7. ఫర్జానియా

గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో రూపొందిన మూవీ ఫర్జానియా. అప్పట్లో ఈ మూవీని బ్యాన్ చేయగా, హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

8. ఇన్షా అల్లా ఫుట్బాల్

బ్రెజిల్ జట్టుకు ఫుట్బాల్ ఆటగాడిగా ఉండాలన్న ఒక కాశ్మీరీ యువకుడి కల ఆయన తండ్రి, రాజకీయ కారణాల వల్ల ఎలా నెరవేరకుండా పోయింది అనేదే ఈ మూవీ స్టోరీ. యూట్యూబ్ లో ఈ మూవీని వీక్షించొచ్చు.

ఇటీవల కాలంలో ఇలాంటి వివాదాస్పద సినిమాలు ఎన్నో వచ్చాయి. ముంబై పేలుళ్లు, టెర్రరిస్టులు, లెస్బియన్ సినిమాలకైతే లెక్కలేదు. అయితే అవన్నీ ఎక్కువగా ఓటిటి లోనే స్ట్రీమింగ్ కావడం గమనార్హం. ఎందుకంటే ఓటిటిలో సెన్సార్ లేదు కాబట్టి యథేచ్ఛగా ఈ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ థియేటర్ లో బొమ్మ పడాలంటే మాత్రం ఖచ్చితంగా సెన్సార్ పరీక్షను దాటాల్సిందే. వీటికి మాత్రం సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు