Suriya and Jyothika : 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక జోడీగా.. అందుకేనా ఆ కష్టాలు?

Suriya and Jyothika : సౌత్ లోని అందమైన కపుల్స్ లో సూర్య, జ్యోతిక జంట కూడా ఒకటి. పలు సినిమాల్లో నటించిన తర్వాత ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది. కానీ రీఎంట్రీ తర్వాత ఈ భార్యా భర్తలిద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. దీంతో చాలా కాలంగా ఇటు సూర్య అటు జ్యోతిక అభిమానులు వీళ్ళిద్దరూ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. తాజా రూమర్స్ ప్రకారం వాళ్ళ కల నెరవేరేలా అనిపిస్తోంది.

అప్పట్లో సౌత్ లో జ్యోతిక హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. నాగార్జున, చిరంజీవి, రవితేజ వంటి స్టార్స్ కు జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక సూర్య అయితే ఇప్పటికీ స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. పెళ్లికి ముందే ప్రేమలో పడ్డ ఈ జంట 2006లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక రీసెంట్ గా సైతాన్ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది జ్యోతిక. మరోవైపు సూర్య కంగువా మూవీతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ జంటను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై జోడిగా చూపించడానికి రెడీ అవుతున్నారనే పుకారు షికారు చేస్తోంది.

బెంగళూరు డేస్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అంజలి మీనన్ లేదా సిల్లుకారుపెట్టి ఫేమ్ హలితా షమీమ్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన వీరిద్దరి ఫ్యాన్స్ అందుకేనా కలిసి జంటగా జిమ్ లో అంతగా కష్టపడుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక కెరీర్ ను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సూర్య, జ్యోతిక జంటగా దాదాపు 7 సినిమాల్లో కలిసి నటించారు. పూవెల్లం కెట్టుప్పార్ నుండి మొదలు పెడితే పెరళగన్, కాఖా కాఖా వంటి చిరస్మరణీయ సినిమాల్లో ఈ సెలెబ్రిటీ కపుల్ కలిసి రొమాన్స్ చేశారు. సిల్లును ఒరు కాదల్‌ అనే తమిళ సినిమాలో వీరిద్దరూ చివరిసారిగా కలిసి నటించారు. తాజా రూమర్స్ నిజమైతే 18 ఏళ్ల గ్యాప్ తరువాత వీరిద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. వెండి తెరపై వీళ్ళిద్దరిని జంటగా చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది కచ్చితంగా ఆనందాన్ని ఇచ్చే వార్తే అవుతుందని చెప్పొచ్చు.

కాగా సూర్య నెక్స్ట్ మూవీ కంగువా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం మూవీ రిలీజ్ కోసం సూర్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2022లో విడుదలైన ఎతర్క్కుం తునింధవన్ మూవీలో చివరగా కన్పించారు సూర్య. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ కంగువా మూవీతో సూర్య ఈసారి రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని నమ్ముతున్నారు ఆయన అభిమానులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు