Political Biopic Movies on OTT : ఓటిటిలో ఉన్న మోస్ట్ వాంటెడ్ సౌత్ పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ ఇవే

Political Biopic Movies on OTT : ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అయితే పొలిటికల్ లీడర్స్ బయోపిక్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పొలిటికల్ లీడర్స్ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి దక్షిణాదిలో పాపులర్ అయిన పొలిటికల్ లీడర్స్ జీవితాలపై వచ్చిన సినిమాలు ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇరువర్

ఒకప్పటి తమిళ దిగ్గజ నాయకులు ఎంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇరువర్. ఈ మూవీని తెలుగులో ఇద్దరు పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్, మోహన్ లాల్ ఎంజీఆర్, కరుణానిధి పాత్రల్లో మెరిశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఇద్దరు మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఆహాతో పాటు అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీతోనే ప్రకాష్ రాజ్ కు మంచి క్రేజ్ దక్కింది.

2. ఎన్టీఆర్ కథానాయకుడు

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీనే ఎన్టీఆర్ కథానాయకుడు. అయితే ఈ మూవీ రెండు భాగాలుగా థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన మూవీ లైఫ్ గురించి, సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహా నాయకుడులో ఆయన పొలిటికల్ లైఫ్ గురించి ప్రస్తావించారు. ఎన్టీఆర్ నట వారసుడు, తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కమర్షియల్ గా ఫెయిల్ అయిన ఈ రెండు సినిమాలను అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. వాస్తవానికి ఎన్టీఆర్ ను తెలుగు వారు ప్రాణంగా భావిస్తారు. కానీ ఆయన సినిమాను మాత్రం తెరపై ఎవ్వరూ చూడకపోవడం గమనార్హం.

- Advertisement -

3. తలైవి

తమిళనాడు ప్రజలంతా అమ్మగా ఆరాధించిన నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన మూవీ తలైవి. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఏఎల్ విజయ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

4. యాత్ర

దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరపైకి వచ్చింది యాత్ర. డైరెక్టర్ మహి వి రాఘవ్ రూపొందించిన ఈ మూవీలో రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

5. యాత్ర 2

యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చింది యాత్ర 2. దీనికి కూడా మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా, రాజశేఖర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చారు. మమ్ముట్టి ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డిగా నటించారు. కోలీవుడ్ హీరో జీవా జగన్మోహన్ రెడ్డి పాత్రలో మెరిశారు. అనూహ్యంగా ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు