11 Years For Gunde Jaari Gallanthayyinde : అది పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమైంది

11 Years For Gunde Jaari Gallanthayyinde : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది హీరోలలో కంటే నితిన్ ఒక ప్రత్యేకమైన హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని ప్లాపులు పడినా కూడా మళ్లీ అదే ఉత్సాహంతో ఇంకో సినిమాను సైన్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తాడు. జయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ కి వరుసగా మంచి సినిమాలు చేసినా కూడా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత వరుస డిజాస్టర్లు చూసాడు. సై సినిమా తర్వాత దాదాపు పదేళ్లు వరకు నితిన్ కెరియర్ లో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా మళ్లీ నితిన్ ని హీరోగా నిలబెట్టింది.

ఇష్క్ సినిమాకు ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆడియో లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్కడితో నితిన్ ఫ్యాన్ బేస్ కూడా బీభత్సంగా పెరిగింది అని చెప్పొచ్చు. దీనికి కారణం నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో ఆ ఆడియో లాంచ్ లో చెప్పడం. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నితిన్ ఓన్ చేసుకున్నారు. మొత్తానికి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే అక్కడితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ని పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ని వదలకుండా పాటిస్తూ వచ్చాడు నితిన్.

ఇష్క్ సినిమా తర్వాత నితిన్ కెరియర్ లో వచ్చిన సినిమా “గుండె జారి గల్లంతయిందే”. ఈ సినిమాను విజయ్ కుమార్ కొండ తెరకెక్కించాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నితిన్ సరసన నిత్య మీనన్ నటించిన. ఇష్క్ సినిమాలో వర్కౌట్ అయినట్టే ఈ సినిమాలో కూడా లవ్ స్టోరీ అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఆ టైంలో ఇదొక క్యూట్ లవ్ స్టోరీ గా చాలా మంది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. అనుప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తావించాల్సిన విషయం వస్తే, దాదాపు 10 ఏళ్లపాటు హిట్ లేకుండా సతమతమైన పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమాతో భీభత్సమైన హిట్టు వచ్చిన సంగతి తెలిసింది. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది ఆ సినిమా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది ఆ సినిమా. అయితే ఆ సినిమాలు మ్యూజిక్ కూడా అద్భుతమైన హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ అందించిన ఆ మ్యూజిక్ ఇప్పటికీ టాప్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో “గుండెజారి గల్లంతయిందే” సాంగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అదే సాంగ్ లోని లిరిక్ ని తీసుకొని తన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు నితిన్.

కేవలం సాంగ్ ని టైటిల్ గా వాడుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాలోని ఒక పాటను కూడా ఈ సినిమాలో రీమేక్ చేశారు. ఈ సినిమా పై అంచనాలను క్రియేట్ చేయడానికి ఈ ఎలిమెంట్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఏమైందో ఏమో ఈవేళ అనే సాంగ్ కూడా థియేటర్లో అద్భుతంగా వర్క్ అవుట్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించడం ఫ్యాన్స్ కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏదేమైనా ప్లాపులతో సతమతమవుతున్న నితిన్ కి వరుస విజయాలు పడడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు.

గుండెజారి గల్లంతయిందే సినిమా రిలీజై అయి, నేటికీ 11 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. నితిన్ కెరియర్ లో ఉన్న కొన్ని సినిమాలలో ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు