Vikram61 : కేజీఎఫ్ లోకి విక్రమ్

మాస్ సినిమాలంటే కోలీవుడ్, కోలీవుడ్ అంటే మాస్ సినిమాలు. తమిళ ప్రేక్షకులు మాస్ సినిమాలను, పాత్రలను ఆదరిస్తారు. అందుకే దర్శక నిర్మాతలు కూడా మాస్ సినిమాలనే తెరకెక్కిస్తారు. అదే సమయంలో సమాజానికి మెసెజ్ ఇచ్చే సినిమాలను కూడా చేస్తారు. అవి కూడా హిట్ అవుతాయి. బాలా దర్శకత్వంలో వచ్చిన పరదేశి నుండి ఇటీవల టి.జె. జ్ఞానవేల్ నుండి నటించిన జై భీమ్ వరకు సినిమాలు గిరిజన సమస్యలపై వచ్చినవే. అలాంటి సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

తాజా గా మరో సారి గిరిజన సమస్యల నేపథ్యంలో సాగే సినిమా తెరకెక్కుతుంది. కబాలీ, కాలా సినిమాలతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్న పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చియన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లో 61వ సినిమా. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చెన్నై లో ప్రారంభమైంది.

19వ శతాబ్దంలో బ్రిటీష్ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కి పూర్తి భిన్నంగా సామాజిక కోణంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది.

- Advertisement -

నిజానికి పా రంజిత్ తన సినిమాలో గిరిజన వాదాన్ని కాస్త గట్టిగానే వినిపిస్తాడు. రజిని కాంత్ కాలా సినిమాతో పా రంజిత్ సినిమా స్టైల్ తెలిసిపోతుంది. దీని కంటే బెటర్ గా విక్రమ్61 సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను కె.ఇ. జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. అలాగే సంగీతాన్ని జి.వి.ప్రకాష్ కుమార్ సమకూరుస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు