Ram Pothineni: ఓవర్సీస్ వదిలేసాడా

ఉస్తాద్ రామ్ పోతినేని తన తాజా చిత్రం ది వారియర్‌తో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఎక్కువశాతం రివ్యూలు రొటీన్ కథాంశంతో సినిమాను యావరేజ్‌గా ప్రకటించాయి. కథానాయకుడు డాక్టర్ నుండి పోలీసుగా మారడం మాత్రమే సినిమా పాయింట్. ఈ రోజుల్లో సినిమాల నుండి చాలా భిన్నమైన స్క్రీన్‌ప్లేను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అలాంటి సినిమాలే సక్సెస్‌ని చూస్తున్నాయి. KGF, పుష్ప, RRR, విక్రమ్ సినిమాలను పరిశీలిస్తే అన్నీ మాస్ సినిమాలే అయినా, మంచి స్క్రీన్‌ప్లే మరియు భారీ ఎలివేషన్స్ తో తెరకెక్కించారు. రామ్ పోతినేని ది వారియర్ ఈ విషయంలో విఫలమైంది. ఫలితంగా కలెక్షన్లు కూడా యావరేజ్ గానే ఉన్నాయి.

ఇక రామ్ విషయానికొస్తే, అతడి కెరీర్‌లో మరో సమస్య ఎదురైంది. నేటి సినిమా ట్రేడ్‌లో ఓవర్సీస్‌ది చాలా కీలక పాత్ర. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైనది. రామ్‌ మినహా దాదాపు ప్రముఖ తెలుగు హీరోలందరూ యూఎస్‌బీఓలో మిలియన్ల డాలర్లు స్కోర్ చేశారు.టాప్‌ టైర్‌ హీరోల రేసులో రామ్‌ నిలవాలంటే ఖచ్చితంగా ఓవర్‌సీస్‌ మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. అతని మునుపటి అత్యధిక వసూళ్లు చేసిన సినిమా నేను శైలజ. ఇది దాదాపు 6.32 లక్షల డాలర్లు వసూలు చేసింది. రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ US లో కేవలం 2.82 లక్షల మాత్రమే డాలర్లు వసూలు చేసింది. రామ్ ఓవర్సీస్ మార్కెట్ పై దృష్టి పెట్టడం లేదనేది చాలామంది అభిప్రాయం. రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి శ్రీనుతో కావడంతో ఆ సినిమాతోనైనా బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు