Aadhi-Nikki : ఆది ప్రేమ కహాని

కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి ఇటీవల హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ ని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలంగా వీరు ప్రేమలో ఉన్నారని, మొత్తానికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. పెళ్లి వార్తలకు ముందు వీరి ప్రేమ వ్యవహారాలు గురించి జనాలకు పెద్దగా ఏమీ తెలీదు. గతంలో ‘మరకతమణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని వీళ్ళ పెళ్లి గురించి పరోక్షంగా హింట్ ఇచ్చాడని, కానీ జనాలు దానిని కామెడీగా తీసుకున్నారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది.

మొత్తానికి ఆది తన ప్రేమ, పెళ్లి విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ‘ది వారియర్’ ప్రమోషన్లో భాగంగా ఈ విషయం పై స్పందించాడు. ‘మ‌లుపు’ సినిమాలో ఇద్దరు తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య స్నేహం లేదట. షూటింగ్ పూర్తి అయిన తర్వాత, స్నేహం కుదిరిందని తెలిపాడు. కొంత‌కాలానికి ఆ స్నేహం ప్రేమ‌గా మారిందని ఆది వివరించాడు. హీరోయిన్ నిక్కీ మొదట ఆదికి ప్ర‌పోజ్ చేసిందట. ఆది వెంటనే ఒకే అని చెప్పకుండా కొన్నాళ్ళు ఆలోచించుకున్నాడట. బాగా ఆలోచించి ఓకే చెప్పాడట. తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పగా, పెళ్లి పీటలవరకు వచ్చిందని చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు