విజయ్ ఆంటోని, నిజానికి తమిళ హీరోనే అయినా ‘బిచ్చగాడు’ ‘డాక్టర్ సలీం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. వీటి తర్వాత కూడా విజయ్ ఆంటోని నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా విజయ్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ‘కోలై’ సినిమా చేస్తున్నాడు.
తెలుగులో ఈ సినిమాకు హత్య అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. రితికా సింగ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఓ హత్య కేసును చేధించే డిటెక్టివ్ గా విజయ్ ఆంటోని ఈ సినిమాలో కనిపించనున్నాడు అనే విషయం ఈ మోషన్ పోస్టర్ ద్వారా అర్థమైపోతుంది.
వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించిన ట్లు సమాచారం. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ” కమల్ బోరా, జి ధనుంజయన్, ప్రతాప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిల్లై, ఆర్ వి ఎస్ అశోక్ కుమార్, సిద్ధార్థ శంకర్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. 1:20 నిమిషాల పాటు సాగే ఈ వీడియో సినిమా పై అంచనాలు పెంచేసింది.