తమిళ సూపర్ స్టార్ విజయ్ శంకర్ చేసిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.కొన్ని హిట్ లను సాధించి మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ,సర్కార్ సినిమాలే కాకుండా అట్లీ దర్శకత్వంలో వచ్చిన అదిరింది, “విజిల్” సినిమాలకు మంచి కలక్షన్స్ వచ్చాయి. చివరగా బీస్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు విజయ్.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “వారిసు” సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన ‘వారిసు’ సినిమా సంక్రాతి రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ కు జోడి గా రష్మిక మందన్నా నటించగా ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ సాంగ్స్, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి.
Read More: GunaSekhar: మహేష్ బాబు చాలా డేంజరస్ పర్సన్
తలపతి విజయ్ సినిమా కావడం తో ఈ సినిమా ప్రొమోషన్స్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు మేకర్స్. తమిళనాడులో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన సిల్వర్ స్క్రీన్ స్టూడియోస్ ప్రమోషన్ క్యాంపు వెనుక ఉండి నడిపిస్తుంది. చెన్నై మెట్రో ట్రయిన్స్ పై పోస్టర్స్ అంటిస్తూ, భారీ స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తెలుగు, హిందీ లో రిలీజ్ కానున్న ‘వారిసు’ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేసారు. సంక్రాతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది.
Read More: Mangalavaram: మంచి టాక్.. వీకెండ్ లో జోరు.. అయినా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు?
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...