Sreeleela : విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

విజయ్ దేవరకొండ హీరోగా గతేడాది రిలీజ్ అయిన లైగర్ సినిమా విజయ్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని తీవ్రంగా నిరాశపరిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే లైగర్ సినిమాకి ముందు విజయ్ దేవరకొండ “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”  సినిమా ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో “వరల్డ్ ఫెమస్ లవర్” అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ రిలీజై ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత విజయ్ పూరి సినిమాపైనే ఆశలన్నీపెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలని సినిమా కోసం బాడీ బిల్డింగ్ కూడా చేసాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ సంవత్సరం పాటు చాలానే కష్టపడ్డాడు కానీ ఏమాత్రం కొత్త ధనంలేని కథ వల్ల సినిమా జనాలకి ఎక్కలేదు. మైక్ టైసన్ క్యామియో రోల్ , అనన్య పాండే బ్యూటీ, విజయ్ ఫెమ్, ఏది సినిమాని కాపాడలేకపోయాయి. పూరి మీద నమ్మకంఎంతో విజయ్, లైగర్ సినిమా విడుదలకి ముందే జనగణమన సినిమా కూడా స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ కంప్లిట్ చేసాడు. కానీ లైగర్ దెబ్బకి ఈ సినిమాని మధ్యలోనే ఆపేసాడు. అయితే ఇలా వరుస ప్లాప్ లతో కంఫ్యూజన్ లో పడ్డ విజయ్ ఇప్పుడిప్పుడే తేరుకొని సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకి చేరుకోవడంతో, జెర్సీ సినిమా ఫెమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ఒక సినిమా కమిట్ అయ్యాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అఫిషల్ లాంచ్ ఈరోజు చేసారు.విజయ్ దేవరకొండకి జోడిగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుంది. విజయ్ మొదటిసారిగా ఈ సినిమా పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు