Boxoffice: విరూపాక్షుడి మరో రికార్డు. వీరయ్య తర్వాత రెండో స్థానం

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. ఏప్రిల్ 21 న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ లో భోగవల్లి ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా ఇప్పటికీ భారీ కలెక్షన్లు రాబడుతుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయినా, ఐపీల్ ఆటంకం కలిగిస్తున్నా కలెక్షన్ల జోరు ఎక్కడా తగ్గడం లేదు.

విడుదలైన 12 రోజుల్లో విరూపాక్ష సినిమా వరల్డ్ వైడ్ గా 40 కోట్లకి పైగా షేర్ సాధించిది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో టార్గెట్ ని రీచ్ అయ్యి 17 కోట్లకి పైగా ప్రాఫిట్ తో డబల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

తాజాగా విరూపాక్ష మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. విరూపాక్ష సినిమా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 11 రోజుల పాటు కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ వసూలు చేసింది. 2023 లో విడుదలైన సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా వరుసగా 12 రోజుల పాటు కోటి రూపాయలకు పైగా షేర్ సాధించి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వీరసింహారెడ్డి 8 రోజులపాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ వసూలు చేసింది. ఇప్పుడు విరూపాక్ష ఆ రికార్డు ని బ్రేక్ చేసి రెండో స్థానంలో చేరింది. ఒక్కసారి 2023 లో విడుదలైన సినిమాలు ఈ రికార్డు లో ఏ స్థానంలో ఉన్నాయో గమనిస్తే..
వాల్తేరు వీరయ్య 12డేస్
విరూపాక్ష 11డేస్
వీర సింహారెడ్డి 8డేస్
దసరా 8డేస్
వారసుడు 5డేస్
దాస్ కా ధమ్కీ 5డేస్ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ రికార్డులు మారిపోయి ఏ సినిమాలు ముందు నిలుస్తాయో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు