Balagam : నాకు 15 ఏళ్లకే పెళ్లి చేసేసారు-రూప లక్ష్మి

ఈ ఏడాది చిన్న సినిమాలలో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం “బలగం”. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు దూరమైతే వారు ఎలా ప్రవర్తిస్తారు.. అదే సమయంలో ఇంటి పెద్ద మరణిస్తే వారంతా ఎలా స్పందిస్తారు, పిండాన్ని కాకి ముట్టకపోతే వారు ఏం చేశారనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ తో పాటు ఓటిటిలో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది.

ఈ సినిమా తీసిన డైరెక్టర్ వేణు తో పాటు ఇందులో నటించిన వారు అందరూ ఫేమస్ అయ్యారు. ఈ చిత్రంలో చనిపోయిన కొమురయ్య కూతురుగా లచ్చవ్వ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది. అచ్చం సొంత బిడ్డ లాగే నటించిన ఈమె ఏడవడం చూసి కన్నీళ్లు పెట్టుకోని మహిళ లేరనే చెప్పవచ్చు. ఈ సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించిన ఈమె పేరు రూపలక్ష్మి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రూప లక్ష్మి మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. “నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. నాకు మొదటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. అందువల్లే పెద్దగా చదువు అబ్బలేదు. మా తండ్రి రైతు, ఆయనకు ఆరుగురు సంతానం, నాకు మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే ఒక లెక్చరర్ కి దత్తతగా ఇచ్చారు. అలా చిన్నప్పుడే పుట్టింటికి దూరమయ్యాను. ఇక కొన్ని కారణాలవల్ల నాకు 15 ఏళ్లకే పెళ్లి చేశారు. ఆ వెంటనే పిల్లలు, పెళ్లి అయిన తరువాతే సినిమాలలోకి వచ్చాను” అని తెలిపింది. ఇక ప్రస్తుతం బలగం సినిమాతో తాను ఎక్కడికి వెళ్లినా తమ ఇంటి ఆడపడుచు మాదిరిగానే చూస్తున్నారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు