Varun Tej : యుద్ధానికి సిద్ధం

ఎఫ్2 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ తరువాత గని సినిమాతో కాస్త‌ నిరాశపరిచాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ అంతర్జాతీయ ఏజెంట్ పాత్రలో కల్పించనున్నాడని సమాచారం. వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి గూడచారి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.అందుకు తగ్గట్లుగా తన లుక్ ను మార్చుకునే పనిలో పడ్డట్లు సమాచారం. గరుడవేగ సినిమాతో స్టైలిష్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు.

నాగార్జున ” ది ఘోస్ట్” కూడా యాక్షన్ సినిమాయే. అయితే ఇప్పటివరకు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే వరుణ్ తేజ్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుందట. VT 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ లండన్ లో ప్రారంభమైంది. సినిమా షూటింగ్ కోసం వరుణ్ తేజ్ సిద్ధమవుతున్న వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోని రిలీజ్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు