VT13: మెగా ఫ్యామిలీ కొత్త పెళ్లి కొడుకు లేటెస్ట్ అప్డేట్ !

మెగా ఫ్యామిలీ నుంచి తొందరలోనే పెళ్లి పీట లెక్కబోతున్ననూతన వరుడు వరుణ్ తేజ్ నుంచి కొత్త అప్డేట్ రానుంది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ పెళ్లి వార్త ట్రెండ్ అవుతుండటంతో ఆ అప్డేట్ వరుణ్ తేజ్ పెళ్లి గురించే అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఆ అప్డేట్ పెళ్లి గురించి కాదు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలకి సంబంధించిన న్యూస్ లు తప్ప వరుణ్ తేజ్ సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఉండవు. కానీ ఈ మధ్య ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో, ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, తొందరలోనే పెళ్లని, కొంత మంది అయితే ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని రాసిన వార్తలతో రోజు ట్రెండ్ అవుతున్నాడు.

ఇక అసలు విషయానికొస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన శక్తి ప్రతాప్ సింగ్ హడా అనే బాలీవుడ్ దర్శకుడి డైరెక్షన్ లో ఇండియన్ నేవి నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సందర్బంగా గాండీవధారి అర్జున సినిమాకి సంబంధించి టీజర్ ని ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసారు. ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సాక్షి వైద్య ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా నటిస్తుంది. ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు