Bhediya Trailer : భయంకరంగా, ఫన్నీగా

బాలీవుడ్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో అందరికీ తెలుసు. సౌత్ సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నా.. బాలీవుడ్ లో అలా జరగడం లేదు. దీంతో చాలా రోజుల నుంచి బాలీవుడ్ మంచి సినిమా కోసం ఎదురుచూస్తుంది. అయితే ఈ రోజు వచ్చిన భేడియా ట్రైలర్ చూస్తే బాలీవుడ్ కు మంచి రోజులు వస్తాయని అనిపిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్, కృతి సనన్ జంటగా వస్తున్న తాజా సినిమా భేడియా. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. తాజాగా బుధవారం ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఆసక్తి రేపుతు ఉంది. ఒక మనిషిని తోడేలు కరవడం, దాని తర్వాత అతనిలో వచ్చిన మార్పులు, ఆ మార్పుల వల్ల ఎదుర్కొన్న సమస్యలు, అలాగే చిన్నపాటి కామెడీ తో సినిమా ఉంటున్నట్టు ట్రైలర్ తో తెలుస్తుంది. అలాగే సినిమా కాస్త భయంకరంగా, కాస్త ఫన్నీగా ఉంటుందని అర్థమవుతుంది.

2 నిమిషాల 55 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ని గమనిస్తే.. సినిమా హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న పట్టణంలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే ట్రైలర్ స్టార్ట్ కాగానే వరుణ్ ధావన్ బెడ్ పై పడుకుంటాడు. బ్యాగ్రౌండ్ లో డైలాగ్స్.. వరుణ్ ధావన్ – “ఆ తోడేలు నన్నే ఎందుకు కరిచింది” అంటాడు. దీనికి కృతి సనన్ – “బహుశా ఆ తోడేలు నిన్ను చంపాడానికే వచ్చిదేమో” అని అంటుంది. తర్వాతి సీన్ లో ఒక అడవిలో వరుణ్ పరుగేడుతాడు. వెనక తోడేలు వస్తుంది. చివరికి వరుణ్ ను తోడేలు కరుస్తుంది.

- Advertisement -

దీని తర్వాత వరుణ్ రోజు రాత్రి తోడేలులా మారి కొంత మందిని చంపుతూ ఉంటాడు. ఈ సమస్య వరుణ్ కు ఎందుకు వచ్చింది? దీని నుంచి వరుణ్ ధావన్ ఎలా బయటపడ్డాడు? తోడేలు రూపంలో ఉన్న వరుణ్ ఎవరి చంపాడు ? ఎందుకు చంపాడు ? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా అడవి ని చూపించే సందర్భంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. దీంతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు