Varun Dhawan: తండ్రి కాబోతున్న స్టార్ హీరో.. సామ్ పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎంతో వేగంగా వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతుండగా.. అంతే వేగంగా తమ జీవితంలోకి కొత్త వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతూ అభిమానులకు శుభవార్తలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన అభిమానులకు శుభవార్త తెలిపారు. త్వరలో తాను తండ్రి గా ప్రమోషన్ పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక తన భార్య నటాషా దలాల్ గర్భవతి అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు వరుణ్ – నటాషా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే వరుణ్ ధావన్ – నటాషా దలాల్ ఇద్దరూ కూడా చిన్ననాటి స్నేహితులన్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసి 2021లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఒక సూపర్ ఫోటో కూడా షేర్ చేశారు వరుణ్ ధావన్.. మోకాళ్ళపై కూర్చొని నటాషా బేబీ బంప్ ను ముద్దు పెట్టుకుంటున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఇక వరుణ్ ధావన్ షేర్ చేసిన క్షణాల్లోనే లక్షల లైకులు, వేల కామెంట్లతో ఈ ఇన్స్టా పోస్టు వైరల్ అయింది . వీరికి కరణ్ జోహార్ , అలియా భట్ , సమంత, పరినీతి చోప్రా, కృతి సనన్ ,కియారా అద్వానీ , నుపూర్ సనన్ , అర్జున్ కపూర్, రాశీ కన్నా, వాణి కపూర్ తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇకపోతే ఈ విషయాన్ని తెలుసుకున్న సమంతా కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేసింది. “ఓ మై గాడ్ బెస్ట్ న్యూస్” అంటూ కామెంట్ పెట్టింది. ఇకపోతే వరుణ్ ధావన్ సమంత కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వరుణ్ ధావన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ బేబీ జాన్ లో నటిస్తున్నారు. ఇది తమిళ్ బ్లాక్ బాస్టర్ విజయ్ థెరి సినిమాకి రీమేక్. ఏ. కాళేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 31వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇందులో వామిక గబ్బి , కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు