Sundeep kishan : “ఊరు పేరు భైరవకోన” ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవకోన” సినిమా 16న వరల్డ్ వైడ్ గా అయిన సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కాగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. VI ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను “ఏకే ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించడం జరిగింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ యావరేజ్ గా ఉన్నా, కొంత వరకు స్క్రీన్ ప్లే మెప్పించడంతో బీసీ సెంటర్ల ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే డీసెంట్ వసూళ్లు అందుకుంటుందనుకున్నా అంచనాలను మించి మంచి కలెక్షన్స్ నే రాబట్టింది.

తొలి రెండు రోజుల్లోనే 6 కోట్లకి పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా అనూహ్యంగా ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది. సందీప్ కిషన్ ట్రాక్ రికార్డ్ వల్ల ఈ సినిమాకు చాలా తక్కువ బిజినెస్ జరగ్గా, ఆ బెనిఫిట్ వల్ల ఊరుపేరు భైరవకోనకి తొందరగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఓవర్సీస్ ఏరియా కావడం విశేషం. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని జనాలు అనుకోవచ్చు. కానీ పెయిడ్ ప్రీమియర్స్ టాక్ వల్ల ఈ సినిమాకి అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో రెండు రోజుల్లో 250k డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. వీకెండ్ ఆదివారం అడ్వాంటేజ్ తో 350k ఈజీ గా దాటేసే అవకాశం ఉంది. అయితే ఊరు పేరు భైరవకోన మూడో రోజు కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో చెప్పొచ్చు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు