Rajinikanth: ఎన్టీఆర్ నుంచి అలాంటి సాయం పొందిన రజినీ.. గ్రేట్ సామి..!

7 పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ.. ఎంతోమంది హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న రజనీకాంత్.. తన సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేస్తున్నాయి. గత ఏడాది విడుదలైన జైలర్ సినిమా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే ఇటీవల లాల్ సలాం సినిమా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ను మూట కట్టుకుంది. ఇకపోతే రజనీకాంత్ కు దైవభక్తి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. అంతేకాదు జీవితంలో ఎలాంటి విషయాలైనా సరే చాలా సాఫీగానే కొనసాగిస్తూ ఉండాలనుకుంటారు రజనీకాంత్.

కానీ రజనీకాంత్ కెరియర్ మొదట్లో కాస్త స్టార్ డం వచ్చిన తర్వాత ఎక్కువగా వ్యసనాలకు బానిసయ్యారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఎక్కువగా రజనీకాంత్ మద్యం తాగే వారని.. అలాగే సిగరెట్లు కూడా తాగేవారని.. వీటివల్ల కొన్నిసార్లు షూటింగ్ కి కూడా సరిగ్గా వచ్చేవారు కాదని.. దీంతో కొన్ని సినిమాలు ఈయన చేసే పనుల వల్ల తట్టుకోలేక మధ్యలోనే ఆపేసేవారు అని సమాచారం.. మరి కొంతమంది డైరెక్టర్లు అయితే రజనీకాంత్ తో షూటింగ్ మొదలయ్యాక ఇతర హీరోలతో ఆ సినిమాలను రీ షూట్ చేసి విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే అలాంటి పరిస్థితులలో సీనియర్ ఎన్టీఆర్ తో ఒక మల్టీ స్టారర్ మూవీని ప్రారంభించారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నారట.. కానీ యధావిధిగా తాగుతూ సరిగ్గా షూటింగ్ కి వచ్చేవారు కాదట రజనీకాంత్. ఇతని పద్ధతి నచ్చక నిర్మాత , డైరెక్టర్ రజినీకాంత్ ని ఈ సినిమా నుంచి తీసేద్దాం అంటూ సీనియర్ ఎన్టీఆర్ కి సలహా ఇచ్చారట.

- Advertisement -

అయితే ఆ మాటతో కోప్పడిన సీనియర్ ఎన్టీఆర్ అతనికి తాగుడు అలవాటు ఉంటే.. ఎలాగో లాగా నచ్చచెప్పి మరీ ఈ సినిమా షూటింగ్ కి తీసుకురండి అంటూ ఆదేశాలు ఇచ్చారట.. అంతేకానీ సినిమా నుంచి తీసేస్తే అతని భవిష్యత్తు ఏమవుతుంది అంటూ దర్శక నిర్మాతల పై సీనియర్ ఎన్టీఆర్ కోప్పడినట్లు సమాచారం. అలా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో రజనీకాంత్ ని ఉండేలా చూసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ ఆయన మాటలు విన్నప్పటి నుంచి మద్యానికి దూరంగా ఉన్నారట. ఇక సీనియర్ ఎన్టీఆర్ లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అంటూ కూడా రజనీకాంత్ పలు సందర్భాలలో వెల్లడించారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు