Vishnu Priya: చచ్చేవరకు మర్చిపోను.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై విష్ణు ప్రియ కామెంట్స్..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఫీమేల్ యాంకర్ విష్ణు ప్రియ బాగా సుపరిచితమే.. పలు రకాల చిత్రాలలో ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా నటిస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. బుల్లితెర పై హాట్ యాంకర్ గా కూడా పేరు సంపాదించింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో ఎక్కువగా బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి షోలలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పండుగ సమయాలలో ఏర్పాటు చేసే స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉండేది.

అయితే ఈమధ్య ఎక్కడా కూడా యాంకర్ గా కనిపించలేదు విష్ణు ప్రియ.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తరచూ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ ఊహించని విధంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. గతంలో తనకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అయితే వారితో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

అయితే అలా టచ్ లో ఉండడమే కాకుండా వారిని తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటూ తెలియజేసి ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది విష్ణు ప్రియ.. తన ప్రాణం ఉన్నంత వరకు వారిని ప్రేమిస్తూనే ఉంటానంటూ కూడా తెలియజేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. అయితే వారిలో తనకి ఏదో ఒక క్వాలిటీ నచ్చే ఇష్టపడి వారితో ప్రేమలో పడ్డానని కానీ మిగతా విషయాల వల్ల వారితో బ్రేకప్ అయ్యిందంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

వారిలో తనకు నచ్చిన క్వాలిటీలను ఇప్పటికీ మెయిన్టైన్ చేస్తూ ఉన్నందువల్ల వారి మీద ఇంకా తనకి ప్రేమ చావలేదంటూ.. ఎప్పటికీ చావదంటూ కూడా తెలియజేసింది.. బ్రేకప్ చెప్పిన తర్వాత వారితో మాట్లాడకుండా అసలు ఉండలేను అంటూ చెప్పేసింది విష్ణు ప్రియ. తనతో బ్రేకప్ చెప్పుకున్న వారందరూ కూడా తన కుటుంబ సభ్యులు గానే భావిస్తానని.. వారికి ఎప్పటికీ తన సపోర్ట్ ఉంటుందంటూ విష్ణు ప్రియ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అయితే ఈ విషయం పై అభిమానులు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా బ్రేకప్ తర్వాత కూడా వారితో కలుస్తాను అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు