Varalakshmi: “చేజింగ్” చేస్తున్న జయమ్మ!

ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత లేడీ విలన్ గా, ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో ఆకట్టుకుంటుంది. తెలుగులో క్రాక్, నాంది, తెనాలి రామకృష్ణ, తదితర సినిమాలలో వరలక్ష్మి పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ ” చేజింగ్” తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే తమిళ్ లో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ” ఒరేయ్ బామ్మర్ది”, ” మై డియర్ భూతం” వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది. కే వీరకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మదిలగన్ మునియండి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో వరలక్ష్మి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనుంది. ఈ సినిమా టాలీవుడ్ లో మంచి సక్సెస్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ కు లేడి ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు