Ustaad Bhagat Singh Teaser : “లాల్ సలాం”ను గుర్తు చేసిన “ఉస్తాద్”… ఇదే మెయిన్ పాయింటా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పట్లో పూర్తవ్వదు అనుకున్న ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అంటూ హరీష్ శంకర్ కొన్ని గంటల క్రితమే మెగా ఫ్యాన్స్ ను అలర్ట్ చేశాడు. అప్పటినుంచి ఈ మూవీ అప్డేట్ కోసం రెట్టించిన క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆకలి తీరేలా తాజాగా అదిరిపోయే డైలాగ్స్ తో ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. మరి ఇంతకీ టీజర్ ఎలా ఉంది ? అందులో హైలెట్స్ ఏంటి? షూటింగ్ లోకేషన్స్ సంగతి ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

“లాల్ సలాం”ను గుర్తు చేసిన “ఉస్తాద్”…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే స్పెషల్ క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ తో ఈ కాంబో మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే మార్చి 19న సాయంత్రం భారీ హైప్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే టీజర్ ను చూశాక రజినీకాంత్ “లాల్ సలాం” మూవీ గుర్తుకు వచ్చింది. హిందూ, ముస్లిం గొడవలు చూపించబోతున్నారా? అనే డౌట్ మొదలైంది. మరి ఇదే సినిమాకు ఇదే మెయిన్ పాయింట్ కాబోతోందా అనేది చూడాలి.

గ్లాస్ అంటే గాజు కాదు సైన్యం…
ఈ టీజర్ ఒక నిమిషం రెండు సెకండ్ల నిడివితో ఉండగా, అందులో పవన్ కళ్యాణ్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించారు. నీ రేంజ్ ఇదీ… అంటూ గ్లాసును పగలగొట్టిన సన్నివేశం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం, గాజు పగిలిపోద్ది… పదునెక్కుద్ది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం… కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్, మధ్య మధ్యలో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలు, వాటికి తగ్గట్టుగా అదిరిపోయే బిజిఎం టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా పవన్ యాక్షన్, స్వాగ్, డైలాగ్స్, లుక్ అదిరిపోయాయి అని చెప్పాలి. అనుకున్నట్టుగానే పొలిటికల్ టచ్ ఇచ్చి జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును హైలెట్ చేయడం గమనార్హం.

- Advertisement -

మూడు నాలుగు లొకేషన్స్ లోనే షూటింగ్…
ఇక టీజర్ ని చూస్తే ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జస్ట్ మూడు నాలుగు లొకేషన్లలోనే చేసినట్టుగా అనిపిస్తోంది. టీజర్ లో ఎక్కువగా గుడిని హైలెట్ చేశారు. మరొకటి పోలీస్ స్టేషన్ కాగా, ముస్లింల దగ్గర ఇంకో సీన్ ను గమనించొచ్చు. అలాగే శ్రీలీల కూడా టీజర్ లో తళుక్కున మెరిసింది. మొత్తానికి ఎన్నికల మూడ్ లో ఉన్న జన సైనికులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ద్వారా ఆకలి తీర్చే కంటెంట్ నే వడ్డించారు. అలాగే ఈ టీజర్ ఎన్నికల వేడిని మరింతగా పెంచుతుంది. జన సైనికుల్లో ఎన్నికల వేళ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను స్పెషల్ గా ఎలక్షన్స్ కోసమే డిజైన్ చేశారని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు