Upasana:పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ ట్వీట్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వేదికపై సత్తా చాటుతుంది. ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రానికి దక్కని రీతిలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 80 వ గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ సీజన్ కమెడియన్ జెరోడు కార్మికుల్ హోస్టుగా లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమైంది. ఈ ప్రధానోత్సవం లో భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారధుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటకి సాహిత్యం అందించారు. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా అభిమానులని ఉర్రూతలూగించాయి.

ఈ పాటకి కొరియోగ్రఫీ చేసింది ప్రేమ్ రక్షిత్. అలాగే పాటలు ఆలపించింది సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. అయితే ఈ అవార్డు రావడంపై రామ్ చరణ్ భార్య కొనిదెల ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది. రామ్ చరణ్ తో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం లో పాల్గొన్న ఉపాసన ఆర్ఆర్ టీం తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. “ఆర్ఆర్ఆర్ టీం లో భాగమైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇది దేశం గర్వించదగ్గ విజయం. ఈ ప్రయాణంలో నేను భాగమయ్యేలా చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి కి కృతజ్ఞతలు. నాతో కలిసి నా బేబీ ఈ అనుభూతిని పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో ప్రత్యేకం” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది ఉపాసన.

For More Updates : 

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు