Tollywood : బ్లాక్ బస్టర్ ఈ సారి కూడా మిస్ ?

టాలీవుడ్ చిన్న సినీ పరిశ్రమ. ఇదే ఒకప్పుడు. కానీ, ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం ఈ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసే సినిమాలు వస్తున్నాయి. కొన్ని భారీ సినిమాలు, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అవుతున్న మరి కొన్ని సినిమాలు సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా, గత ఆరేళ్ల నుండి తెలుగు ఇండస్ట్రీకి జూలై అంటే ఎంతో ప్రత్యేకం.

ఈ నెలలో వచ్చే సినిమాలు సూపర్ హిట్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. 2014 జూలై లో ‘దృశ్యం’, 2015 జూలై లో ‘బాహుబలి’, 2016 జూలై లో ‘పెళ్ళి చూపులు’, 2017 జూలై లో ‘ఫిదా’, 2018 జూలై లో ‘ఆర్.ఎక్స్.100’, 2019 జూలై లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలు వచ్చే అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇలా ఆరేళ్ళుగా జూలై నెల అనేది బ్లాక్ బస్టర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 లో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పెద్ద గా సినిమాలు రిలీజ్ కాలేదు. 2021 జూలై లో ‘తిమ్మరుసు’ ‘ఇష్క్’ లాంటి చిన్న సినిమాలు విడుదల అయినా, కరోనా ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. దీంతో 2021 జూలై లో కూడా బ్లాక్ బస్టర్ పడలేదు.

2022 జూలై లో అయినా సరైన బ్లాక్ బస్టర్ పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జూలైలో ఇప్పటికే ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్ అయ్యింది. అది అంతంత మాత్రమే ఆడింది. ఈ వారం అయితే బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంది. ‘హ్యాపీ బర్త్ డే’ ‘మాయోన్’ ‘గంధర్వ’ వంటి చిత్రాలను జనాలు పట్టించుకోవడం లేదు. దీంతో అందరి చూపు ‘ది వారియర్’ ‘థాంక్యూ’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాల పై పడింది. మరి ఆ సినిమాల్లో ఒక్కటైనా సక్సెస్ అవుతాయా ? బ్లాక్ బస్టర్ జూలై సెంటిమెంట్ ను కొనసాగిస్తాయా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది తెలియాలంటే, ఈ మూడు సినిమాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు