Isha Chawla : 8 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ

సాయికుమార్ తనయుడు ఆది డెబ్యూ మూవీ ‘ప్రేమ కావాలి’ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2011 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇషా చావ్లా. తొలి చిత్రంతోనే తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఓ దశలో ఈ భామతో వర్క్ చేయడానికి రాంచరణ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఏది ఏమైనా ఇషా చావ్లా కు మంచి ఆఫర్లే వచ్చాయి. సునీల్ హీరోగా వచ్చిన ‘పూల రంగడు’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

దీని తర్వాత ఇషా చావ్లాకు అవకాశాలు తగ్గిపోయాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సునీల్ సరసన ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ అంతగా ఆడలేదు. తర్వాత 2014లో అల్లరి నరేష్ తో ‘జంప్ జిలాని’ అనే చిత్రం చేసింది. అది కూడా అంతంత మాత్రమే ఆడింది.

దీంతో ఇషా చావ్లా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 8 ఏళ్ళ తర్వాత ఇషా చావ్లా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. రీ ఎంట్రీ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఇషా చావ్లా టీం చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు