Tillu Square : టిల్లుగాని అరుదైన ఘనత.. ఆ చిత్రాల సరసన!

Tillu Square : టాలీవుడ్ లో ఈ వారం క్రేజీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా టిల్లు స్క్వేర్. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. సిద్ధూ స్వయంగా ఈ రెండు సినిమాలకి కథలనందించడం విశేషం. ఇక మార్చి 29న రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల నుండి యానానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లను అందుకుంటుంది. మామూలుగా కాస్త బోల్డ్ కంటెంట్, అలాగే మాస్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమాకి బి,సి సెంటర్ల ప్రేక్షకులు తప్ప ఏ సెంటర్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వరు. కానీ ఈ సినిమాకి మల్టీప్లెక్స్ లో కూడా ఎగబడి చూసేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో తెలుగు రాష్ట్రాలకు ధీటుగా టిల్లు గాడు అక్కడ అదరగొడుతున్నాడని చెప్పాలి. నైజాం వసూళ్లకు మించి అక్కడ భారీ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం.

ఆ చిత్రాల సరసన టిల్లు గాడు..

ఇదిలా ఉండగా వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన టిల్లు స్క్వేర్ ఓవరాల్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా తాజాగా టిల్లు స్క్వేర్ ఓ అరుదైన ఘనతని సాధించిందని చెప్పాలి. మామూలుగా టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు అంతగా ఆడవని ప్రచారంలో ఉంది. అలా చాలా చిత్రాలు ప్లాప్ అయ్యాయి కూడా. అప్పట్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2 వంటి సినిమాలే ఉదాహరణ. కానీ కొన్నాళ్లుగా సీక్వెల్ సినిమాలు కూడా మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకున్నాయి. సీక్వెల్ కి సరైన కంటెంట్ దొరికితే మూవీ హిట్ ని ఆపడం ఎవరితరం కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 2, హిట్ 2, బంగార్రాజు, కార్తికేయ 2 వంటి సినిమాలు సీక్వెల్స్ గా వచ్చి మంచి హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలకి ఇప్పడు మూడో పార్ట్ కూడా తెరకెక్కుతుండటం విశేషం. తాజాగా ఈ సినిమాల సరసన టిల్లు గాడు కూడా చేరిపోయాడు. డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అవగా భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాడు. సీక్వెల్స్ తో కూడా హిట్టు కొట్టిన ఆ సినిమాల జాబితాలో టిల్లు స్క్వేర్ కూడా చేరింది. ఇక ఇప్పుడు డీజే టిల్లు కి మూడో సీక్వెల్ కూడా తీసే యోచనలో మేకర్స్ ఉన్నారు.

వంద కోట్ల దిశగా..

ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమా ఇప్పటికే 70 కోట్ల మార్క్ ని అందుకుని 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. రెండో వీకెండ్ లోకి అడుగుపెట్టేసరికి టిల్లు స్క్వేర్ వంద కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమనిపిస్తుంది. ఈ సినిమాకి ఓవర్సీస్, నైజాం ఏరియాల్లో బయ్యర్లు భారీ లాభాలు అందుకుంటున్నారు. ఇక టిల్లు స్క్వేర్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశి నిర్మించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో నటించిన రాధికా అలియాస్ నేహా శెట్టి స్పెషల్ అప్పీరెన్స్ మూవీ విజయానికి మరింత హెల్ప్ అయిందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు