Dil Raju : ఆ డేట్ నాకు సెంటిమెంట్

Dil Raju : తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు ఒరిజినల్ పేరు వెంకటరమణారెడ్డి. అయితే మొదటి దిల్ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేయటం వలన అక్కడి నుంచి రాజు కాస్త దిల్ రాజు అయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలను చేసి అద్భుతమైన ఘనవిజయాలను సాధించాడు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన తెరకెక్కిన అన్ని సినిమాలు కూడా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి. ఒక సందర్భంలో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అది బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుంది. కుటుంబం అంతా కలిసి ప్రశాంతంగా చూడొచ్చు అనే ఒక నమ్మకం కూడా కలిగింది.

అయితే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో అద్భుతమైన సినిమాలు మాత్రమే రావడం కాకుండా ఎంతో మంది దర్శకులును కూడా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తెలుగు సినిమా పరిశ్రమకు అందించింది. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి, వంటి అందరూ దర్శకులును పరిచయం చేసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్. అయితే దిల్ రాజుకి కథలు విషయంలో మంచి జడ్జిమెంట్ ఉంటుంది. దిల్ రాజ్ జడ్జిమెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

ఇకపోతే ఈ బ్యానర్ దాదాపు 50 సినిమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పైన కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించాడు. శంకర్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. శంకర్కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ తమిళ్ లో చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా రిలీజై అద్భుతమైన విజయం సాధించాయి.

- Advertisement -

ఇకపోతే ఈ బ్యానర్లో ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించాడు. విజయ్ సరసన మృణల్ ఠాకూర్ ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సాంగ్స్ కూడా వినసొంపుగా ఉన్నాయి.

ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో చాలా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 5 అనేది తనకి మంచి లక్కున్న డేట్ అని, తన మొదటి సినిమా కూడా అదే డేట్ న రిలీజ్ అయిందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి దిల్ సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ అయింది. ఇకపోతే ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి కలిసొస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. అలానే ఏప్రిల్ 4న ఈ సినిమాను ప్రీమియర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి వేయనున్నట్లు తెలిపారు. ఇకపోతే తన ప్రొడక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ సినిమాలు అన్ని ఘనమైన విజయాన్ని సాధించాయని శ్రీనివాస కళ్యాణం సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ బాగా ఆడాయి అని చెప్పుకొచ్చారు దిల్ రాజు ( Dil Raju ).

మొదట ఇదే డేట్ కి దేవర సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు అదే ప్లేస్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుంది. సినిమాకు కొంచెం మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు