SSMB28 :మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే !

మహేష్ బాబు సినిమా హంగామా మెల్లి, మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఈనెల31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వస్తుండటంతో ఈ సందర్బంగా మహేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ కి చాలా ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఆయన బర్త్ డేని పురస్కరించుకొని మహేష్ సినిమాకి సంబందించిన అప్డేట్ అభిమానులతో పంచుకోవడం చాలా యేళ్లుగా ఆచారంలాగ వస్తోన్న విషయమే. అయితే గతేడాది సూపర్ స్టార్ కృష్ణ కాలం చెల్లించిన విషయం అందరికి తెలిసిందే. కృష్ణ లేకుండా మహేష్ సినిమా అప్డేట్ వస్తుండటం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ల సినిమా టైటిల్ ఏది పెట్టాలా అనే విషయంలో మూవీ యూనిట్ కి క్లారిటీ లేకుండా ఉందని తెలుస్తోంది. ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మూవీ టీం సినిమా టైటిల్ మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. మహేష్ కి ఏమో 3 అక్షరాల సెంటిమెంట్ ఎక్కువ, త్రివిక్రమ్ కి ఏమో అచ్చ తెలుగులో పెద్దగా ఉండే టైటిల్ అంటే మక్కువ. ఈ కారణంగా సినిమా టైటిల్ ఏది పెట్టాలో ఎవరికీ బోధపడటం లేదంట.

గతంలో త్రివిక్రమ్, మహేష్ కలిసి చేసిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులని ఎంతగా మెప్పించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 13 యేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం 3 టైటిల్ లు పరిశీలనలో ఉన్నాయి. మొదటిది “అమరావతికి అటు..ఇటు”..కాగా రెండోది “గుంటూరు కారం(మిర్చి)”, మూడోది “ఊరికి మొనగాడు”, ఇవే కాకుండా “పల్నాడు పోటుగాడు” అనే మాస్ టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట. కానీ వీటిలో ఏది పెడతారో ఎవరికీ తోచకుండా ఉందట. దాంతో ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ అంత ఎవరికీ తోచిన టైటిల్ వాళ్ళు రాసుకుంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. కానీ గురూజీ ఏ టైటిల్ ఫైనల్ చేస్తాడనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు. పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో మొదలవబోతుంది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవబోతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు