Tollywood: తెలుగు హీరోలు అమితంగా ఇష్టపడే ఫుడ్ ఐటమ్స్ ఇవే..!

సాధారణంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కూడా మిగతా విషయాలలో భిన్నంగా ఉన్నప్పటికీ ఆహారం విషయంలో తమకు నచ్చిన ఆహారం ఎదురుగా కనిపించిందంటే చాలు.. అప్పటి వరకూ ఫుడ్ పైన తాము పెట్టుకున్న నిభందలను అన్నింటినీ పక్కన పెట్టేస్తూ వుంటారు. ఇక తమకు నచ్చిన ఆహారాన్ని తినడం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారనటంలో సందేహం లేదు. ఇకపోతే సెలబ్రిటీలను ఇష్టపడే అభిమానులు కూడా వారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలు కూడా అమితంగా ఇష్టపడే ఆహారాల గురించి ఇప్పుడు చూద్దాం..

నాని:
నాచురల్ స్టార్ హీరో నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న నానికి ఇడ్లీ, సాంబార్, కిచిడి అంటే చాలా ఇష్టం అట. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు రాజకీయంగా కూడా పేరు దక్కించుకున్నారు. ఇక ఈయన ఫేవరేట్ ఫుడ్ అరటికాయ వేపుడు.

- Advertisement -

ప్రభాస్:
రెబల్ స్టార్ ప్రభాస్ మంచి భోజనం ప్రియులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆయన ఇతర సెలబ్రిటీ లకు కూడా తన ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తూ వుంటారు. మరి ఈయనకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ.

అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈయన ఫేవరేట్ ఫుడ్ థాయ్, మెక్సిన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.

ఎన్టీఆర్:
స్టార్ హీరో ఎన్టీఆర్ కి బిర్యానీ, చికెన్ 65 అంటే చాలా ఇష్టమట.

మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు కి బిర్యానీ , కాఫీ అంటే ఎనలేని ఇష్టం.

నాగార్జున:
కింగ్ నాగార్జున కి ఇష్టమైన ఆహారం చేపలు, దోశ, గ్రిల్లిడ్ చికెన్ అంటే ఇష్టం.

రవితేజ:
మాస్ మహారాజా రవితేజ కి పులావ్ అంటే చాలా ఇష్టమట.

రామ్ చరణ్:
రామ్ చరణ్ కి ఇష్టమైన ఆహారం బిర్యానీ.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు