Amani: అక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువే.. ఆమని సంచలన కామెంట్స్..!

ప్రముఖ నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహజ నటనతో 90 లలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా దూసుకుపోతున్నారు. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటున్న ఈమె గత కొద్దిరోజుల క్రితం క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

జంబలకడిపంబ సినిమాతో టాలీవుడ్లోకి వచ్చిన ఆమని స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. కొద్ది రోజుల క్రితం తమిళ ఇండస్ట్రీలో తాను ఫేస్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే నటి ఆమని ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకడి పంబ సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత మిస్టర్ పెళ్ళాం, శుభసంకల్పం, శుభలగ్నం వంటి అద్భుతమైన చిత్రాలలో నటించిన ఈమె రెండు సార్లు నంది అవార్డును కూడా అందుకుంది తెలుగు తో పాటు తమిళ్,

- Advertisement -

కన్నడ చిత్రాలలో కూడా నటించిన ఈమె పెళ్లి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకు దూరమై సెకండ్ ఇన్నింగ్స్ లో హలో గురు ప్రేమకోసమే, చావు కబురు చల్లగా, మిడిల్ క్లాస్ అబ్బాయిల పలు చిత్రాలలో నటించింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్లు చేసింది.

సినిమా అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఫోటోలు చూసి పిలిచేవారు.. తీరా వెళ్లిన తర్వాత ఈ అమ్మాయా అని పెదవి విరిచేవారు.. రంగు తక్కువగా ఉండడం వల్లే తాను సినిమాలలో రిజెక్ట్ అయినట్లు తెలిపింది. రంగు చూసి అనుమానంతోనే మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించే వారని.. ఈ విషయం తనను ఎంతగానో బాధ పెట్టిందని గుర్తు చేసుకోండి. తెలుగులో కంటే తమిళ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేదని.. తాను ఫేస్ చేశానని.. సినిమా అవకాశం కోసం పిలిచినప్పుడు టూ పీస్ దుస్తులు ధరించాలి..

స్ట్రెచ్ మార్కులు ఏమైనా ఉన్నాయా? దుస్తులు విప్పి చూపించండి..వంటి ప్రశ్నలు కొందరు తనను అడిగారని.. ఏదైనా సినిమా ఒప్పుకొని అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత.. మేనేజర్ వచ్చి డైరెక్టర్ గారో ఫైనాన్సరో మిమ్మల్ని ఒకసారి బీచ్ దగ్గరికి రమ్మంటున్నారు అని పిలిచేవారని.. ఇలా చాలా అద్వానంగా అక్కడ ప్రవర్తించారని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తమిళ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది ఆమని.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు