Box office: ఈ వారం ఆ ఒక్క సినిమా పైనే ఆశలు?

టాలీవుడ్ లో కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు రావడం లేదన్న సంగతి తెలిసిందే. విరూపాక్ష తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే రాలేదు. లేకలేక గత వారం వచ్చిన సినిమాల్లో “మేమ్ ఫేమస్” కొంచెం బెటర్ టాక్ తెచ్చుకుని హిట్ అయినా, ఆ సినిమా కూడా పెద్ద కంటెంట్ ఉన్న సినిమాయేమి కాదు. కామెడీ డ్రామా గా వచ్చి ఉన్న సినిమాల్లో బెస్ట్ అయింది. అయితే ఈ వారం అయినా టాలీవుడ్ లో మంచి పేరున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అంటే లేదనే చెప్పాలి.

జూన్9 న నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే అందులో ఏ సినిమాకు సరైన హైప్ గాని ఎక్సపెక్టషన్స్ గాని లేవు. వాటిల్లో రెండు సినిమాలు డబ్బింగ్ చిత్రాలు అవగా ఒకటి స్ట్రెయిట్ పిక్చర్. ఇంకోటి ద్విభాషా చిత్రం. ఇక ఈ సినిమాలో , మొదటగా సిద్ధార్థ్ నటించిన “టక్కర్” జూన్ 9 న విడుదల అవుతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా పై ఆడియన్స్ పట్ల మిశ్రమ స్పందన వస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే పాత చింతకాయ పచ్చడిలా ఉండడమేగాక సిద్ధార్థ్ లుక్స్ కూడా అంత బాగాలేదు. ఇక మరో సినిమా ట్రాన్స్ ఫార్మర్స్ అనే డబ్ సినిమా కూడా అదే రోజున వస్తుంది.

ఇక ఇదే రోజు విడుదలవుతున్న తెలుగు సినిమా “అన్ స్టాపబుల్”. కామెడీ నేపథ్యం తో తెరకెక్కిన ఈ సినిమాలో అందరు చిన్న నటులు నటించారు. ఇక జూన్9 న విడులవుతున్న సినిమా “విమానం”. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది ఆకట్టుకుంది. ఈ సినిమా కామెడీ, ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమా ఫీల్ గుడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జూన్ 9 న విడుదల అవుతున్న సినిమాల్లో మంచి అంచనాలున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది “విమానం” అనే చెప్పాలి. మరి ఈ సినిమాల్లో ఏది మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు