2023: ఏడాది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

2023: రెమ్యునరేషన్.. సాధారణంగా ఏ సినిమాకైనా హీరో రెమ్యునరేషన్ అనేది ఆ సినిమా బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే హీరో క్రేజ్ ని బట్టి కూడా పారితోషకం మారుతూ ఉంటుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రేపటితో ఈ ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు భాషా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ను మొదలుకొని కోలీవుడ్ హీరోలు ధనుష్, విజయ్ రజినీకాంత్ లతో పాటు బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ వంటి వారు కూడా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను అలరించారు. ఇలా ఈ హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి, రూ .100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. ఇకపోతే ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకోవడమే కాదు భారీ పారితోషకం తీసుకున్న హీరోల గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది.

మరి ఈ ఏడాది అధిక మొత్తంలో పారితోషకం అందుకున్న హీరో ఎవరు అంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ ఏడాది నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాకి రజినీకాంత్ ఏకంగా రూ.210 కోట్ల పారితోషకం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమని చెప్పవచ్చు. ఇప్పటివరకు రూ.100 కోట్లు లేదా రూ.150 కోట్ల వరకు పారితోషకం తీసుకున్న హీరోలను మనం చూసాం.. అయితే రజనీకాంత్ మాత్రం ఏకంగా రూ.210 కోట్ల పారితోషకం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక రజనీకాంత్ తర్వాత ప్రభాస్ , షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు అధికంగా పారితోషకం తీసుకున్న హీరోలుగా నిలిచారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు