Love Life : అమ్మాయి ప్రేమలో పడితే ఇలా బిహేవ్ చేస్తుంది… మీకు నచ్చిన అమ్మాయి సంగతేంటి?

Love Life : ప్రేమ అనేది ఒక ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన అనుభూతి. ప్రేమ ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యనైనా అధిగమించగలం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే ప్రేమకు, కామానికి మధ్య చాలా తేడా ఉంటుంది. జస్ట్ అట్రాక్షన్ ఉంటే ఒకసారి శృం*రంలో పాల్గొన్న తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి అట్రాక్షన్ ఉండదు. అదే నిజంగా ప్రేమలో ఉంటే ఇష్టమైన వాళ్లతో ఎంత సేపు కలిసి ఉన్నా తనివి తీరదు. జీవితాంతం వాళ్లతోనే కలిసి నడుద్దాం అనిపిస్తుంది. అయితే ఈ ప్రేమను వ్యక్తపరచడం అందరికీ అంత ఈజీ ఏం కాదు. ముఖ్యంగా అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవడం అబ్బాయిలకు ఎప్పటికీ అర్థం కాదు. చాలామంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి తమను ప్రేమిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోలేక సతమతమవుతుంటారు. మరి అమ్మాయి నిజంగా ప్రేమలో పడితే ప్రవర్తిస్తుంది? మీకు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా? అనే విషయాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1.

A girl behaves like this when she falls in love

- Advertisement -

మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏమిటంటే ఆమె మిమ్మల్ని చూసి గర్వపడుతుందని, ఆ విషయం ఈ విధంగా మీకు అర్థమయ్యేలా చేయాలనుకుంటుంది. ఇక ఆమె ఎంత అందమైన వ్యక్తితో ఉందో ఈ ప్రపంచం చూడాలని, మీతో ఉన్న సమయంలో తాను ఎంత ఆనందంగా ఉందో ఈ ప్రపంచానికి తెలియజేయాలని, కొంతమంది మీ జంటను చూసి అసూయ పడాలని కోరుకుంటుంది అని అర్థం. కాబట్టి అబ్బాయి అయినా, అమ్మాయి అయినా తమకు ఇష్టమైన పార్ట్నర్ ను స్నేహితులకు పరిచయం చేసింది అంటే ఆమె జీవితాంతం మీతో కలిసి నడవాలని కోరుకుంటుంది అని అర్థం.

2.

A girl behaves like this when she falls in love

ఇక మీరు లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకునే అమ్మాయి మీతో ఎక్కువ సమయం గడపాలని ఆశపడితే అది కచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అర్థం. ఏ సమయంలోనైనా, మీరు ఏం చేస్తున్నా అందులో తను కూడా ఉండాలి అనుకుంటుంది. అంతేకాకుండా తన గురించి మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా, మీరేం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తుంది. అలాగే మీ ప్రాధాన్యతలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయాలని ఆమె ఆలోచిస్తుందని అర్థం.

3.

A girl behaves like this when she falls in love

ఏ అమ్మాయి అయినా సరే మీతో నిజంగా ప్రేమలో ఉంటే ఆమె మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. మీకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా అందులో పాల్గొనడానికి ప్రయత్నిస్తుంది. మీ బర్త్ డే వంటి ప్రత్యేకమైన ఈవెంట్లను బాగా గుర్తు పెట్టుకుంటుంది. మీకు సంతోషాన్ని కలిగించే వాటిపై శ్రద్ధ చూపుతుంది. మీ మధ్య ఏదైనా తగాదా వచ్చినప్పుడు తన మాట మాత్రమే వినాలని పట్టుబట్టకుండా మీ కోణాన్ని కూడా వినడానికి ప్రయత్నిస్తుంది.

4.

A girl behaves like this when she falls in love

ఇక మీరు ఎలా ఉన్నా సరే ఒక అమ్మాయి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు అద్భుతంగా కనిపిస్తున్నారని భావిస్తుంది. నిజంగా ప్రేమలో ఉన్న అబ్బాయి కైనా అమ్మాయికైనా తమకు ఇష్టమైన వారు ఎలా ఉన్నా సరే సెక్సీగానే కనిపిస్తారు. “నా కళ్ళతో చూడు మామ” అనే డైలాగ్ ను అందరూ వినే ఉంటారు. ఎందుకంటే ప్రేమలో ఉన్న వారికి వాళ్ళ పార్టనర్ ఇతరుల కంటికి ఎలా కనిపించినా తమ కళ్ళకు మాత్రం ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు.

5.

A girl behaves like this when she falls in love

ఇక నిజంగా ప్రేమలో ఉన్న అమ్మాయిల్లో కనిపించే మరో బిహేవియర్ నవ్వడం. మీ జోక్ ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయికి మాత్రం ఫన్నీ గానే కనిపిస్తుంది. కాబట్టి మీరు పిచ్చి జోకులు వేసిన ఆమె నవ్వుతుంది అంటే కచ్చితంగా మీరంటే తనకు ఇష్టం అని అర్థం. నవ్వు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బెస్ట్ కనెక్షన్.

6.

A girl behaves like this when she falls in love

ఇక మీకు నచ్చిన అమ్మాయి తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మీతో కలిసి చర్చిస్తుంది అంటే వారి జీవితంలో మిమ్మల్ని చాలా ముఖ్యమైన వారిగా భావిస్తుంది అని అర్థం. అలాగే ఆమె మీరు ఇష్టపడే విషయాలపై ఆసక్తిని చూపించడం, మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ రిస్ట్రిక్షన్ పెట్టకుండా మిమ్మల్ని మీలా ఉండేలా ప్రోత్సహించడం వంటివి చేస్తోంది అంటే ఆ అమ్మాయి కచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అర్థం. అయితే దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోకుండా ఆమె ప్రపోజ్ చేసేదాకా వెయిట్ చేయండి. లేదంటే మీ పట్ల ఇలాంటి బిహేవియర్ వ్యక్తపరుస్తున్న అమ్మాయిలకు ప్రపోజ్ చేసి చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు