Shooting : ది ఘోస్ట్ పూర్తి

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంక్రాంతి బరిలో బంగార్రాజు సినిమాతో వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. నాగ చైతన్య, కృతి శెట్టి కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత కింగ్ నాగార్జున మరో సినిమా చేశాడు. అదే ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కించారు. బంగార్రాజు మూవీ కంటే ముందే ది ఘోస్ట్ అనే మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా చిత్ర బృందం కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసింది.

కానీ, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. కాజల్ తప్పుకోవడంతో మూవీ యూనిట్ మరో హీరోయిన్ కోసం చాలా రోజులు సెర్చ్ చేశారు. దీంతో సినిమా షూటింగ్ కొంత వరకు ఆలస్యమైంది. చివరికి ఎఫ్ 3 బ్యూటీ సోనల్ చౌహాన్ ను మూవీ యూనిట్ ఎంపిక చేసింది. షూటింగ్ సెట్ లోకి సోనల్ చౌహాన్ వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక అప్డెట్ ను అభిమానులతో పంచుకున్నారు. నాగార్జున ది ఘోస్ట్ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా దానికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఉన్నారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రం నాగ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇంటర్ పోల్ యూనిఫామ్ తో, చేతులో గన్స్ పట్టుకుని నాగ్, సోనాల్ ఉన్నారు. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు