NTR Death Anniversary: ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..!

తెలుగు సినీ పరిశ్రమకి నందమూరి తారక రామారావు అటు తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎంతో గొప్పదనాన్ని సంపాదించారు. ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే .. ఎన్నో సంచలన విజయాలను అందుకొని రాజకీయాలలో కూడా ఎవరు ఊహించని విధంగా ఎన్నో సంచలనాలను సృష్టించారు. అలాంటి నందమూరి తారక రామారావు 1996 జనవరి 18న కన్నుమూశారు. అయితే ఎన్టీఆర్ గురించి తెలియని కొన్ని విషయాలు ఈ రోజున వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి చూద్దాం.

 

1). నందమూరి తారక రామారావు గారు 1940వ సంవత్సరంలో తన కుటుంబ పోషణ కోసం హోటల్లో పాలు కూడా పోసేవారట.

- Advertisement -

2). 4 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకున్నారు.. అది కూడా ప్రముఖ డాన్సర్ అయిన పెంపటి చిన్న సత్యం దగ్గర నేర్చుకున్నారు.

3). ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు దాదాపుగా 17 సినిమాలలో శ్రీకృష్ణుడి వేషం వేశారట.

4). దేవాలయాలలో పూజారిగా ఉండే వృత్తికి బ్రాహ్మణులకు అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను నిర్ణయించే విధంగా అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ దే..

5). ఎన్టీఆర్ ఒకసారి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టాచ్యు చూసి.. హైదరాబాదులో కూడా ఇలాగే ఉండాలని.. ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారట.

6). ఎన్టీఆర్ నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఒక సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పగా ఆ విషయంపై ఎన్టీఆర్ కోర్టు వరకు వెళ్లి మూడేళ్ల తర్వాత కేసు గెలిచి సినిమాని రిలీజ్ చేశారట.

7). మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావు ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా తన చేతితో నీళ్లు ఇచ్చి.. ఆయన కాళ్లు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత భోజనాన్ని కూడా స్వయంగా ఎన్టీఆర్ వడ్డించారని సమాచారం.

8). సినిమా షూటింగ్ ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి .. ఎన్టీఆర్ కుడి చేయి నాలుగు సార్లు విరిగిందట.. అందుకే ఎక్కువ శాతం ఎడమ చేతితోనే పలు రకాల పనులు చేసేవారు.

9).సీనియర్ ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ తర్వాత 90 రోజుల వ్యవధిలోనే..35,000 కిలోమీటర్ల ప్రయాణించి ఒక ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్లు ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ చేతిలో ఉండేది.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్టీఆర్ తన చేతుల్లోకి తీసుకొని ..మొదటిసారి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు