OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్… “ఓజీ”లో పాట పాడనున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమా కోసం సింగర్ గా మారబోతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ “ఓజి” కోసం మరోసారి తన గాత్రాన్ని వినిపించడానికి పవన్ రెడీ అవుతున్నట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బయట పెట్టడం విశేషం.

పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలపైనే ఉంది. మరోవైపు ఈ హీరోతో సినిమాలు చేయడానికి దర్శకుడు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా సుజిత్, క్రిష్, హరిష్ శంకర్ వంటి దర్శకులు పవన్ కళ్యాణ్ కోసం క్యూలో ఉన్నారు. ఇటీవల బ్రో సినిమాతో తన అభిమానులను ఆకట్టుకున్న పవన్ ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల్లో ముందుగా “ఓజి” సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం మరోసారి పవన్ కళ్యాణ్ సింగర్ గా మారబోతున్నట్టు సమాచారం. “ఓజి” మూవీకి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని బయట పెట్టారు. తాజాగా సూపర్ సింగర్ సీజన్ 2 కి గెస్ట్ గా హాజరైన తమన్ మాట్లాడుతూ ఓజి స్క్రిప్ట్ లో పవన్ చేత పాట పాడించడానికి అవకాశం ఉందని, తాము అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే “ఓజీ”లో మరోసారి అభిమానులు ఆయన పాడే పాటను వినొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ తన సినిమాలకు పాట పాడడం ఇదే మొదటిసారి కాదు. తమ్ముడు సినిమాలో “ఏం పిల్ల మాటాడవా” అనే పాట పాడడంతో పవన్ సింగింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ఖుషి సినిమాలో “బైబయ్యే బంగారు రమణమ్మ”, జానీ సినిమాలో “నువ్వు సారా తాగకు”, పంజా సినిమాలో “పాపారాయుడు”, అత్తారింటికి దారేది సినిమాలో “కాటమరాయుడా”, అజ్ఞాతవాసి సినిమాలో “కొడకా కోటేశ్వరరావు” వంటి స్పెషల్ సాంగ్స్ పాడి పవన్ సింగర్ గా అదరగొట్టాడు. ఇందులో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన కాటమరాయుడా సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మరోసారి పవన్ కళ్యాణ్ తన పాటతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు