Thank You : నాగ చైతన్య “థాంక్యూ” టీజర్ అవుట్

అక్కినేని నాగ చైతన్య డైవర్స్ తర్వాత స్పీడ్ పెంచేశాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలపైనే చైతన్య ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ ఎంత పెద్ద హిట్ అందుకుందో అందరకీ తెలుసు. దీని తర్వాత నాగ చైతన్య మరో సారి లవ్ స్టోరీ నేపథ్యంలో ’’థాంక్యూ’’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ గా రాశీ ఖన్నా, నాయర్ కీలక పాత్రలో అవికా గోర్, మాళవిక నటిస్తున్నారు. ఈ మూవీ జులై 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజా గా ఈ మూవీ నుండీ టీజర్ ను రిలీజ్ చేశారు.

డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమాను డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించాడని టీజర్ తో తెలుస్తుంది. హీరో నాగ చైతన్య క్లాస్‌, మాస్‌ గెటప్‌ తో ప్రేక్షకులను ఆకర్షించేలా కనిపిస్తున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తన మార్క్ సంగీంతాన్నీ, బీజీఎంను అందించినట్టు టీజర్ తో అర్థమవుతుంది. యంగ్ ఏజ్ లో మాస్ విద్యార్థిగా, హాకీ ప్లేయర్ గా, బిజినెస్ మ్యాన్ గా నాగ చైతన్య వేరియేషన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశముంది. నాగ చైతన్య – రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు తెలుస్తుంది.

- Advertisement -

మొత్తంగా ఈ టీజర్ తో అంచనాలు భారీగానే పెరిగాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు