యంగ్ హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేస్తున్న ఏజెంట్, తర్వాతి షెడ్యూల్ కు సిద్ధమైంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్ సెట్స్ లో కనిపించారు.
Read More: BABY: కష్టం- కన్నీళ్లు కలిస్తే ఈ బేబీ
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. కాగా, ఈ మూవీ ఆగస్టు 12న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది.
Read More: Urfi Javed: రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...