Thalapathy67: లియో.. బ్లడీ స్వీట్

తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ‘బీస్ట్’ తర్వాత ఆయన మరో భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 67వ సినిమా. అనిరుద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న వారి పోస్టర్లను మేకర్స్ వరుసగా రివీల్ చేస్తూ వస్తున్నారు. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో కనిపించనున్నట్టు చెబుతూ పోస్టర్లను వదిలారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీం తాజాగా త్రిష పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన కథానాయికగా ఆమె అలరించనుంది.

ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ లాంచ్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించగా, తాజాగా ఈ సినిమా టైటిల్ ను రివిల్ చేసింది చిత్ర యూనిట్. లోకేష్ కనగరాజ్ మరోసారి తనదైన ఫార్మాట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ఈ టైటిల్ రివిల్ ప్రోమో వీడియో చూస్తే అర్థమవుతుంది. లోకేష్ మార్క్ హీరో ఎలివేషన్ తో ఈ టైటిల్ రివీల్ ప్రోమో కట్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దూసుకొస్తున్న విలన్లకు చుక్కలు చూపించేందుకు హీరో ఓ కత్తిని చాక్లెట్ క్రీమ్ లో ముంచి తీసి, తన వేలితో టెస్ట్ చేస్తాడు. బ్లడీ స్వీట్ అంటూ విజయ్ చెప్పడంతో ఈ సినిమా టైటిల్ ను రివిల్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘లియో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు