Leo: తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ! షాక్ లో కోలీవుడ్ సినీ పరిశ్రమ

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై విజయ్ ఫ్యాన్స్ అంత ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తెలుగు, తమిళ్ మరియు ఇతర సినీ పరిశ్రమల నుంచి చాలా మంది హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే కొంతమంది సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్  అయితే, ఇంకొంత మందికి మాత్రం రాజకీయాలలో నిలబడలేక, ఇటు మళ్ళీ సినిమాలు చేయలేక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. సినిమాల్లో ఉండే క్రేజ్ రాజకీయాల్లోను వోట్ బ్యాంకుగా మారుతుందా, లేదా అనేది చెప్పడం చాలా కష్టం.

అయితే లేటెస్ట్ గా తమిళ్ హీరో విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సినీ తరాల లిస్ట్ లో చేరనున్నారు. విజయ్ కి తమిళనాడులో విపరితమైన క్రేజ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఫ్యాన్స్ అందరి చేత తలపతిగా పిలవబడే ఈ స్టార్ హీరో తొందర్లోనే తన పొలిటికల్ ఎంట్రీని ఎనౌన్స్ చేయనున్నాడట. సూపర్ స్టార్ రజిని కాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోలు కూడా ఇలాగె క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని, పార్టీని నడపటం సినిమాల్లో నటించినంత ఈజీ కాదని గ్రహించి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటుండగా, ఇటివంటి పరిస్థుతులలో తలపతి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

తలపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రాబోయే ఎలక్షన్స్ లో ఎంఎల్ఏ గా పోటీ చేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్ ఏ పార్టీ నుంచి చేస్తాడు, లేక తానే పార్టీ పెడతాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు